Rajamouli: లగ్జరీ కార్లు, భవనాలు… దర్శకధీరుడు రాజమౌళి ఆస్తుల విలువ తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది!

తన సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తాను. సినిమా బడ్జెట్ నుండి బిజినెస్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ప్రస్తుతం రాజమౌళి ఒక్కో సినిమాకు వంద కోట్ల వరకు తీసుకుంటున్నారు.

Written By: S Reddy, Updated On : April 2, 2024 4:48 pm

Rajamouli Net Worth and Assets

Follow us on

Rajamouli: తెలుగు సినిమాకు గ్లోబల్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు రాజమౌళి. సక్సెస్ కి ఆయన కేర్ ఆఫ్ అడ్రస్. దాదాపు పాతికేళ్ల కెరీర్లో రాజమౌళి చేసింది 12 చిత్రాలు మాత్రమే. వీటిలో ఇండస్ట్రీ హిట్స్, బ్లాక్ బస్టర్స్ , సూపర్ హిట్స్ మాత్రమే ఉన్నాయి. రాజమౌళి కోసం స్టార్స్, ప్రొడ్యూసర్స్ ఎదురు చూస్తూ ఉంటారు. రాజమౌళి నిబద్ధత గల ఫిల్మ్ మేకర్. తాను అనుకున్న అవుట్ ఫుట్ కోసం తీవ్రంగా కష్టపడతాడు. ఆలస్యమైనా కూడా ఉన్నత నిర్మాణ విలువలతో సినిమా అందించాలి అనుకుంటారు. రాజమౌళికి పలు క్రాఫ్ట్స్ మీద కూడా అవగాహన ఉంది.

ఇక తన సినిమాకు అన్నీ తానై వ్యవహరిస్తాను. సినిమా బడ్జెట్ నుండి బిజినెస్ వరకు అన్నీ దగ్గరుండి చూసుకుంటాడు. ప్రస్తుతం రాజమౌళి ఒక్కో సినిమాకు వంద కోట్ల వరకు తీసుకుంటున్నారు. మరి ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే దర్శకుడిగా ఉన్న రాజమౌళి ఆస్తుల విలువ ఎంత అనేది చూద్దాం.

రాజమౌళి ఉన్నత కుటుంబంలో పుట్టాడు. అయితే పూర్వీకుల నుండి వచ్చిన ఆస్తి కరిగిపోవడంతో బాల్యంలో కటిక పేదరికం అనుభవించాడట. అందుకే రాజమౌళి డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఆయన దుబారా ఖర్చులు చేయరు. దానధర్మాలు కూడా తక్కువే. రాజమౌళి ఆస్తులు పరిశీలిస్తే ఆయనకు హైదరాబాద్ లోని మణికొండలో ఒక లగ్జరీ హౌస్ ఉంది. దీనిని 2008లో కొనుగోలు చేసినట్లు సమాచారం.

అలాగే హైదరాబాద్ శివారులో ఒక ఫార్మ్ హౌస్ ఉంది. ఖరీదైన కారులు ఉన్నాయి. రాజమౌళి ఆస్తి విలువ రూ. 150 కోట్ల వరకు ఉంటుందని సమాచారం . కాగా రాజమౌళికి సొంత బిడ్డలు లేరు. కార్తికేయ రమా రాజమౌళి మొదటి భార్య కొడుకు. ఒక అమ్మాయిని దత్తత తీసుకున్నారు. రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా చాలా సింపుల్ గా ఉంటారు. కాగా నెక్స్ట్ ఆయన మహేష్ బాబుతో మూవీ చేస్తున్నారు. ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయట. దాదాపు రూ. 800 కోట్ల బడ్జెట్ తో మూవీ తెరకెక్కించనున్నారు.