https://oktelugu.com/

SS Rajamouli Movies: రాజమౌళి తీసిన 12 సినిమాలు ఏవి ? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ?

SS Rajamouli Movies: చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఇద్దరు నటులు పోటా పోటీగా తమ నటనా కౌశల్యం ప్రదర్శించారు అంటే కారణం.. రాజమౌళి. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అంటే కారణం.. రాజమౌళి. భారతీయ సినీ తెర పై ఒక కళాఖండం వచ్చింది అంటే కారణం… రాజమౌళి. మహా సముద్రంలా ఎన్టీఆర్, అగ్నిపర్వతంలా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించినా కారణం.. రాజమౌళి. అందుకే రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది. అసలు దేశ సినీ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 26, 2022 / 02:39 PM IST
    Follow us on

    SS Rajamouli Movies: చాలా కాలం తర్వాత తెలుగు తెరపై ఇద్దరు నటులు పోటా పోటీగా తమ నటనా కౌశల్యం ప్రదర్శించారు అంటే కారణం.. రాజమౌళి. ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు అంటే కారణం..
    రాజమౌళి. భారతీయ సినీ తెర పై ఒక కళాఖండం వచ్చింది అంటే కారణం… రాజమౌళి. మహా సముద్రంలా ఎన్టీఆర్, అగ్నిపర్వతంలా రామ్ చరణ్ నట విశ్వరూపం చూపించినా కారణం.. రాజమౌళి. అందుకే రాజమౌళిని చూసి ఇండియన్ సినిమా గర్విస్తోంది.

    SS Rajamouli Movies

    అసలు దేశ సినీ చరిత్రలో ఉన్న రికార్డ్స్ ను తిరగరాసేలా సినిమా తీయడం ఒక్క రాజమౌళికే చెల్లింది. క్రికెట్ వరల్డ్ కప్ అయిపోగానే మళ్ళీ ఎప్పుడో నాలుగేళ్ళకి కదా ఇంత పెద్ద పండుగ అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా.. రాజమౌళి సినిమాల విషయంలో కూడా ప్రేక్షకులకు సేమ్ ఇదే ఫీలింగ్ ఉంటుంది.

    Also Read: Allu Arjun Congratulated RRR Team: వైరల్ : ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కి అల్లు అర్జున్ కంగ్రాచ్యులేషన్స్

    ఇంతకీ ద‌ర్శ‌క‌ధీరుడు ఇప్ప‌టి వ‌రకూ తీసిన సినిమాలు 12. మరి ఆ 12 సినిమాల బ‌డ్జెట్ ఎంత ? ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది ? లాంటి వివరాలు తెలుసుకుందాం.

    1. స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్ :

    Student No.1

    ఎన్టీఆర్ హీరోగా వచ్చిన ‘స్టూడెంట్ నంబ‌ర్ వ‌న్’ సినిమా రాజమౌళికి మొదటి సినిమా. 4 కోట్ల‌కు ఈ చిత్రాన్ని అమ్మగా.. ఈ చిత్రం 11.3 కోట్లు కలెక్ట్ చేసింది.

    2. సింహాద్రి :

    Simhadri

    ఎన్టీఆర్ ను స్టార్ ను చేసిన సినిమా ఇది. సింహాద్రి సినిమాను 13 కోట్ల‌కు అమ్మారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 26 కోట్లు కలెక్ట్ చేసింది.

    3. సై :

    Sye

    హీరో నితిన్ హీరోగా న‌టించిన ‘సై’ సినిమా రాజమౌళికి మూడో సినిమా. ఈ సినిమాను 7 కోట్ల‌కు విక్ర‌యించారు. అయితే, ఈ సినిమా 9.5 కోట్లను వ‌సూలు చేసింది.

    4. ఛ‌త్రప‌తి :

    Chatrapathi

    రెబల్ స్టార్ ప్ర‌భాస్ హీరోగా న‌టించిన ‘ఛ‌త్రప‌తి’ చిత్రాన్ని 13 కోట్ల‌కు అమ్మారు. బాక్సాఫీస్ వద్ద ఛ‌త్రప‌తి చిత్రం మొత్తం 22 కోట్లు కలెక్ట్ చేసింది.

    5. విక్ర‌మార్కుడు :

    Vikramarkudu

    ర‌వితేజ హీరోగా వచ్చిన విక్ర‌మార్కుడు సినిమా రాజమౌళికి ఐదో సినిమా. ఈ చిత్రాన్ని 11 కోట్ల‌తో నిర్మించి.. 14 కోట్ల‌కు విక్ర‌యించారు. ఈ చిత్రం 14.50 కోట్లు కలెక్ట్ చేసింది.

    6. య‌మ‌దొంగ :

    Yamadonga

     

    ఎన్టీఆర్ ‘య‌మ‌దొంగ’ సినిమాను 15 కోట్లు నిర్మించి 18 కోట్లకు అమ్మారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 38 కోట్ల‌ను రాబ‌ట్టింది.

    7. మ‌గధీర‌ :

    Magadheera

    రామ్ చ‌ర‌ణ్ హీరోగా వచ్చిన ‘మ‌గధీర‌’ను 44 కోట్ల‌తో నిర్మించారు. 48 కోట్ల‌కు అమ్మారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 59 కోట్లను రాబ‌ట్టింది.

    8. మ‌ర్యాద‌రామ‌న్న :

    Maryada Ramanna

    సునీల్ హీరోగా తెర‌కెక్కించిన మ‌ర్యాద‌రామ‌న్న సినిమా రాజమౌళికి ఏడో సినిమా. 14 కోట్ల‌తో నిర్మించిన ఈ చిత్రం 20 కోట్ల‌కు అమ్మారు. ఈ సినిమా 29 కోట్ల‌ను కలెక్ట్ చేసింది.

    9. ఈగ :

    Eega

    ఈగ సినిమాను 26 కోట్ల‌తో నిర్మించ‌గా 32 కోట్ల‌కు విక్ర‌యించారు. ఈ సినిమా 46 కోట్ల‌ను వ‌సూలు చేసింది.

    10. బాహుబ‌లి :

    Baahubali

    బాహుబ‌లి బిగినింగ్ చిత్రాన్ని 138 కోట్లతో నిర్మించారు. ఇక 191 కోట్ల‌కు ఈ సినిమాని అమ్మారు. అయితే, ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 302 కోట్ల‌ను కలెక్ట్ చేసింది.

    11. బాహుబ‌లి కంక్లూజ‌న్ :

    Baahubali 2

    బాహుబలి కంక్లూజ‌న్ చిత్రాన్ని రూ.250 కోట్ల‌తో నిర్మించారు. అయితే, ఈ చిత్రం 1617 కోట్ల‌ను కలెక్ట్ చేసింది.

    12. ఆర్ఆర్ఆర్ :

    RRR

    ఈ సినిమాని రూ.350 కోట్ల‌తో నిర్మించారు. మరి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేస్తోందో చూడాలి. ఫస్ట్ డే అయితే.. 118 కోట్లు కలెక్ట్ చేసింది.

    Tags