SS Rajamouli: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శక ధీరుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటి ని సంపాదించుకున్న దర్శకుడు రాజమౌళి… ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా విజువల్ వండర్ గా తెరకెక్కుతుండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఆయన చేసిన 12 సినిమాల్లో 12 సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలిచాయి…రాజమౌళి తన కెరియర్ మొదట్లో ‘స్టూడెంట్ నెంబర్ వన్’ సినిమా చేసినప్పుడు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి వ్యవహరించాడు. అయితే మొదట్లో కీరవాణి కొంచెం అనారోగ్యానికి గురవ్వడంతో ఆ టైమ్ లో ఆయన రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందట. ఇక ఈ క్రమంలోనే రాజమౌళి కోటిని డైరెక్టర్ గా తీసుకుందామని అనుకున్నాడు. కానీ కోటి మాత్రం అప్పుడు బిజీగా ఉండడం వల్ల రాజమౌళి సినిమాని రిజెక్ట్ చేశాడట. ఇక ఎలాగూ ఆ సినిమా షిట్ కి కొంత గ్యాప్ రావడంతో అప్పటివరకు కీరవాణి ఆరోగ్యం సెట్ అయిపోయింది.
దాంతో ఆ సినిమాకి కీరవాణి నే మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఇక ఈ క్రమంలోనే ఈ సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక రాజమౌళి మొదటి సినిమా నుంచి ఇప్పుడు చేస్తున్న ‘వారణాసి’ సినిమా వరకు అన్ని సినిమాలకి కీరవాణి నే మ్యూజిక్ డైరెక్టర్ గా చేస్తున్నాడు. ఇక రాజమౌళి సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా చేసే అవకాశం వస్తే చాలు అని చాలా మంది సంగీత దర్శకులు ఎదురుచూస్తున్నప్పటికి ఆయన మాత్రం కీరవాణితోనే వెళుతున్నాడు.
కారణమేంటి అంటే తనకు మ్యూజిక్ కి సంబంధించిన విషయాల్లో పెద్దగా అవగాహన లేదని కీరవాణి అయితే వాటిని సక్రమంగా చూసుకుంటాడనే ఉద్దేశ్యంతోనే కీరవాణి ని పెట్టుకుంటున్నాను అంటూ రాజమౌళి చెబుతున్నాడు. నిజానికి రాజమౌళి తన మొదటి సినిమాకే సంగీత దర్శకుడిగా కోటిని తీసుకోవాలనుకున్నాడు. కానీ కోటికి మాత్రం అదృష్టం దక్కలేదనే చెప్పాలి.
రాజమౌళితో వర్క్ చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఆర్టిస్టులు సైతం ఆసక్తి చూపిస్తుంటారు. అలాంటిది కోటికి వచ్చిన అవకాశాన్ని వదిలేసుకున్నాడు అంటూ మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాజమౌళితో కీరవాణి తప్ప మరే మ్యూజిక్ డైరెక్టర్ కి సినిమా చేసే అవకాశం రాలేదు. మరి ఫ్యూచర్లో ఎవరికైనా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…
