Rajamouli : రాజమౌళి చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తారు. గత పాతికేళ్లలో ఆయన 12 సినిమాలు మాత్రమే. ఆర్ ఆర్ ఆర్ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఆయన మరో సినిమా స్టార్ట్ చేయలేదు. ఆర్ ఆర్ ఆర్ చిత్రీకరణ దశలో ఉండగానే రాజమౌళి తన నెక్స్ట్ మూవీ మహేష్ బాబుతో అని ప్రకటించారు. ఎస్ఎస్ఎంబి 29 స్క్రిప్ట్ పూర్తి చేయడానికే రాజమౌళి రెండేళ్ల సమయం తీసుకున్నాడు. ఈ విషయం కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ స్వయంగా తెలియజేశారు. ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి, ఒక పది రోజులు ఎంజాయ్మెంట్ మూడ్ లో కి వెళ్ళాడట.
విషయంలోకి వెళితే రాజమౌళి అన్నయ్య, ఆస్థాన మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ కోడూరి వివాహం చేసుకున్నాడు. యూఏఈ లో ప్రముఖ హోటల్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది. రాజమౌళి కుటుంబ సభ్యులు అందరూ ఈ పెళ్ళికి హాజరయ్యారు. దాదాపు 10 రోజులు యూఏఈలో జరిగింది. ఈ పెళ్లి వేడుకలో రాజమౌళి ఆహ్లాదంగా గడిపారట. హోటల్ లో సదుపాయాలు కూడా అద్భుతంగా ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా రాజమౌళి తెలియజేశారు.
ఇక శ్రీసింహ వివాహం ముగిసిన నేపథ్యంలో తిరిగి ఆయన ఎస్ఎస్ఎంబి 29 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీ కానున్నారు. ఎస్ఎస్ఎంబి 29 జంగిల్ అడ్వెంచర్ డ్రామా. దాదాపు రూ. 1000 కోట్ల బడ్జెట్ తో నిర్మించనున్నారు. మహేష్ బాబును సరికొత్తగా రాజమౌళి పరిచయం చేయనున్నాడు. హాలీవుడ్ నటులు, సాంకేతిక నిపుణులు పని చేయనున్నారని సమాచారం.
ఇక శ్రీసింహ భార్య పేరు రాగ. ఈమె ప్రముఖ నటుడు మురళీ మోహన్ మనవరాలని సమాచారం. శ్రీసింహ బాల నటుడిగా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యాడు. యమదొంగ, మర్యాద రామన్న చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాడు. మత్తువదలరా చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. తెల్లవారితే గురువారం, భాగ్ సాలే, ఉస్తాద్, మత్తు వదలరా 2 చిత్రాల్లో శ్రీ సింహ హీరోగా నటించాడు.
Web Title: Ss rajamouli enjoyed 10 days at keeravanis son srisimhams wedding
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com