Srimukhi: బుల్లితెర యాంకర్ శ్రీముఖి బిగ్ బాస్ షో సీజన్3 విన్నర్ అవుతుందని అందరూ భావించగా ఆమె చేసిన చిన్నచిన్న పొరపాట్లు రాహుల్ సిప్లిగంజ్ బిగ్ బాస్ షో విన్నర్ కావడానికి కారణమయ్యాయి. బిగ్ బాస్ షో తర్వాత కొంతకాలం పాటు శ్రీముఖి మరే షోకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరోవైపు అదే సమయంలో శ్రీముఖి నటించిన పలు సినిమాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ రిజల్ట్ ను సొంతం చేసుకున్నాయనే సంగతి తెలిసిందే.
అయితే శ్రీముఖి మళ్లీ వరుస షోలతో బిజీ అవుతున్నారు. పలు ఈవెంట్లలో కూడా పాల్గొని శ్రీముఖి సందడి చేస్తున్నారు. సాధారణంగా బిగ్ బాస్ షోలో పాల్గొన్న తర్వాత ఏడాది వరకు ఆ షోలో పాల్గొన్న కంటెస్టెంట్లు ఇతర టీవీ ఛానెళ్ల ప్రోగ్రామ్ లలో పాల్గొనడానికి అవకాశం లేదు. ఆ నిబంధన వల్ల శ్రీముఖి కొంతకాలం పాటు టీవీ షోలకు దూరం కావాల్సి వచ్చిందని జోరుగా ఉంది. జీ తెలుగు ఛానల్ లో ప్రసారమవుతున్న జీ సరిగమప షోకు శ్రీముఖి హోస్ట్ గా ఉన్నారు.
అదే సమయంలో కొన్ని రోజుల క్రితం ఈటీవీ ప్లస్ ఛానల్ లో మొదలైన జాతిరత్నాలు షోకు శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మల్లెమాల ఈ షోను నిర్మిస్తుండగా ఈ షో సక్సెస్ సాధిస్తుందని శ్రీముఖి ఫ్యాన్స్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. శ్రీముఖి ఈ షోకు ఒక్కో షెడ్యూల్ కు 6 లక్షల రూపాయల నుంచి 7 లక్షల రూపాయల వరకు రెమ్యునరేషన్ ను అయితే అందుకుంటున్నారని తెలుస్తోంది.
రీఎంట్రీలో కూడా శ్రీముఖి క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ఆమె హోస్ట్ గా వ్యవహరిస్తున్న షోలకు మంచి రేటింగ్స్ వస్తుండటంతో నిర్మాతలు సైతం ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. శ్రీముఖి మరిన్ని కొత్త ఆఫర్లతో బిజీ కావాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
[…] Bigg Boss Telugu Non Stop OTT: తెలుగు బుల్లితెరపై ఎవర్ గ్రీన్ షో బిగ్ బాస్.. ఇప్పుడు ఓటీటీ రూపు సంతరించుకొని 24 గంటలూ ప్రసారమవుతోంది. విశేషమైన ప్రేక్షకాదరణ పొందుతోంది. రోజంతా ప్రసారం అవుతుండడంతో ఎవరు బాగా ఆడుతున్నారు..? ఎవరు ఆడడం లేదన్నది ప్రేక్షకులకు ఈజీగా అర్థమైపోతోంది. ఇప్పటికే రంజుగా సాగుతున్న బిగ్ బాస్ కు ఇప్పుడు కాస్త మసాలా , ఎంటర్ టైన్ మెంట్ యాడ్ చేసేందుకు నిర్వాహకులు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ఓ ఎంటర్ టైనర్ ను హౌస్ లోకి దించాలని యోచిస్తున్నారు. ఆ కామెడీ పంచే ఎంటర్ టైనర్ ఎవరు? ఎప్పుడు వెళుతాడన్న దానిపై స్పెషల్ ఫోకస్. […]