Avinash: జబర్దస్త్ షో ద్వారా, బిగ్ బాస్ షో ద్వారా పాపులారిటీని పెంచుకున్న అవినాష్ ప్రేక్షకులను ఎప్పుడూ నవ్విస్తూ ఉంటారనే సంగతి తెలిసిందే. జబర్దస్త్ షో నిర్వాహకులకు 10 లక్షలు కట్టి ఆ షోకు దూరమైన అవినాష్ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని నెలల క్రితం పెళ్లి చేసుకుని సంతోషంగా జీవనం సాగిస్తున్న అవినాష్ స్టార్ మా ఛానల్ లో ప్రసారమవుతున్న ఇస్మార్ట్ జోడీ2 ప్రోగ్రామ్ కు హాజరయ్యారు.
తాజాగా ఇస్మార్ట్ జోడీ2 ప్రోగ్రామ్ ప్రోమో విడుదల కాగా ఈ షోకు ఓంకార్ యాంకర్ గా వ్యవహరిస్తున్నారనే సంగతి తెలిసిందే. ఓంకార్ అవినాష్ గురించి చెబుతూ ఎలాంటి సపోర్ట్ లేకుండా ఈ రంగంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ రూపాయిరూపాయి కూడబెట్టుకుని ఇల్లు కట్టుకుని అవినాష్ సొంత కాళ్లపై నిలబడ్డాడని ఓంకార్ వెల్లడించారు. అవినాష్ ను చూసి గర్వపడుతున్నానని ఓంకార్ అన్నారు.
ఓంకార్ మాటలను విన్న తర్వాత అవినాష్ ఆ తర్వాత ఎమోషనల్ అయ్యారు. ఒకరిని మనం నవ్వించే సమయంలో మనల్ని మనం జోకర్ గా చూసుకోవాలని నెగిటివ్ కామెంట్లు వచ్చినా ఓర్చుకున్న నువ్వు రియల్లీ గ్రేట్ అని ఓంకార్ వెల్లడించారు. అమ్మకు నాన్నకు ఆపరేషన్ చేయించానని ఇల్లు కట్టుకున్నానని ఆ సమయంలో అకస్మాత్తుగా జీరోకి వెళ్లిపోయానని అవినాష్ కామెంట్లు చేశారు.
నా అనుకునే వాళ్లను సాయం అడిగితే చేయనని చెప్పారని అవినాష్ చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ సమయంలో తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నానని అవినాష్ వెల్లడించారు. స్టార్ మా నాకు సక్సెస్ ఇచ్చిందని స్టార్ మా ఛానల్ కు తాను రుణపడి ఉంటానని అవినాష్ తెలిపారు. బిగ్ బాస్ కంటెస్టెంట్ విశ్వ కూడా ఈ షోలో తన కష్టాలను చెప్పుకొచ్చారు.
[…] Pawan Kalyan Son First Film: మన టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి క్రేజ్ ఉందొ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..అభిమానులు ఆయనని ఆరాధ్య దైవంలా భావిస్తారు..ఆయన సినిమా వస్తుంది అంటే చాలు చిన్న పిల్లల నుండి పెద్ద వాళ్ళ వరుకు థియేటర్స్ వైపు క్యూ కడుతారు..అలాంటి స్టార్ హీరో కొడుకు సినిమాల్లోకి వస్తే ఎలా ఉంటుందో మన ఊహకి కూడా అందదు..లేటెస్ట్ గా ఆయన తనయుడు అకిరా నందన్ ఫోటోలు మరియు బాక్సింగ్ వీడియోలు సోషల్ మీడియా లో చూస్తూ ఉంటె పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ కొత్తల్లో వచ్చినప్పుడు ఎలా ఉండేవాడో అలా కనిపిస్తున్నాడు..లేటెస్ట్ గా ఆయన జిం లో చేసిన బాక్సింగ్ వీడియో మరియు కర్ర సాము వీడియోలు చూసి అభిమానులు తమ్ముడు సినిమాలోని పవన్ కళ్యాణ్ ని గుర్తుకు చేసుకున్నారు..ఇక సోషల్ మీడియా అభిమానులందరూ త్వరలో అకిరా నందన్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు అని..దానికోసమే ఇప్పటి నుండి కసరత్తులు చేస్తున్నాడు అని, ఇలా రకరకాల ఊహించుకుంటూ పోస్టులు పెట్టారు..అయితే వీటిని గమనించిన రేణు దేశాయ్ వెంటనే స్పందించి అకిరా నందన్ కి సినిమాల్లో నటించే ఆసక్తి లేదు అని..వాడికి మ్యూజిక్ మీద బాగా ఆసక్తి అంటూ చెప్పుకొచ్చింది. […]