https://oktelugu.com/

Srimukhi – Avinash : అవినాష్ చెంప పగలకొట్టిన శ్రీముఖి.. ఆ ముద్దే కారణమా ?

"పార్థూ ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు" అంటూ ముక్కు అవినాశ్ చొక్కా పట్టుకుంది. దీంతో అప్పటిదాకా నార్మల్ గా ఉన్న అవినాష్ ఒక్కసారిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి, శ్రీముఖి ని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఊహించని ఈ పరిణామంతో షాక్ అయిన శ్రీముఖి వెంటనే తేరుకుని అవినాష్ గూబ గుయ్ మనే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది.

Written By:
  • Shiva
  • , Updated On : July 21, 2023 / 02:18 PM IST
    Follow us on

    Srimukhi – Avinash : బుల్లితెర రాములమ్మగా పాపులారిటీ సంపాదించుకున్న శ్రీముఖి గురించి  ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బండిల్ ఆఫ్ ఎనర్జీ తో తాను ఎక్కడ ఉంటే అక్కడ ఫుల్ జోష్ నింపే శ్రీముఖి ప్రస్తుతం తెలుగు బుల్లితెర మీద తిరుగులేని లేడీ యాంకర్ అని చెప్పుకోవాలి. తన మాటలతోనే కాకుండా తన అందంతో కూడా షోని  రక్తి కట్టిస్తూ ముందుకు దూసుకుపోతుంది. స్టార్ మా లో  ప్రసారమయ్యే ఆదివారం విత్ స్టార్ మా పరివారం  ఎంతటి సక్సెస్ అయ్యిందో అందరికి తెలుసు, తాజాగా రిలీజ్ అయిన ప్రోమో మాత్రం ఒక్కసారికి వైరల్ అవుతుంది. దానికి కారణం ముక్కు అవినాష్ యాంకర్ శ్రీముఖికి ముద్దు ఇవ్వబోవటమే.

    ప్రతి వారం వారం టెలికాస్ట్ అయ్యే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లో స్టార్ మా లోని సీరియల్స్ లో నటించే వాళ్ళని గెస్ట్ లు పిలిచి వాళ్ళతో సరదాగా రకరకాల గేమ్స్ ఆడిస్తూ, నవ్విస్తూ, అప్పుడప్పుడు ఏడిపిస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది శ్రీముఖి . అదే విధంగా ఈ వారం కూడా   ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్ ‘ అనే కాన్సెప్ట్ తో పాత సీరియల్స్ లో నటించిన జంటలను గెస్ట్ లుగా తీసుకొని వచ్చారు. వాళ్లతో గేమ్స్ ఆడించే క్రమంలో శ్రీముఖి , ముక్కు అవినాష్ మధ్య ముద్దు సన్నివేశం చోటుచేసుకుంది.

    నిఖిల్-కావ్య (గోరింటాకు) జోడికి ఓ టాస్క్ ఇచ్చింది. వాళ్లకు ఒక డైలాగ్ ఇచ్చి ఇలా యాక్ట్ చేయమని చెప్తూ చూపించింది. “పార్థూ ఒక్కసారి వచ్చి నాకు ముద్దు పెట్టు” అంటూ ముక్కు అవినాశ్ చొక్కా పట్టుకుంది. దీంతో అప్పటిదాకా నార్మల్ గా ఉన్న అవినాష్ ఒక్కసారిగా క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి, శ్రీముఖి ని ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే ఊహించని ఈ పరిణామంతో షాక్ అయిన శ్రీముఖి వెంటనే తేరుకుని అవినాష్ గూబ గుయ్ మనే రీతిలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. దీంతో అవినాష్ షాక్ అవ్వడం, మిగతా గెస్ట్స్ పగలబడి నవ్వడం జరిగింది.

    నిజంగానే ముక్కు అవినాష్ క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయ్యాడో లేక, కామెడీ చేద్దాం అనుకోని చేశాడో కానీ, మొత్తానికి ఆ సీన్ మాత్రం వైరల్ అవుతుంది. ఇప్పటికే మంచి రేటింగ్ తో అదరకొడుతున్న ఈ షో కి ఈ వైరల్ ఎపిసోడ్ అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. అదే విధంగా ఎక్స్ ప్రెస్ హరి, పైమా జోడి చేసే కామెడీ కూడా ఈ షో కి ప్లస్ అవుతుంది. పైగా గెస్ట్ లు ఏమో సీరియల్ యాక్టర్స్ కావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ బాగానే కనెక్ట్ అవుతున్నారు.  మరి ముఖ్యంగా “జానకి కలగనలేదు” సీరియల్ హీరో అమర్దీప్ షో కి వచ్చిన సందర్భంలో శ్రీముఖి మాత్రం ఒక రేంజ్ లో రెచ్చిపోతుంది. బోల్డ్ డైలాగులు, పంచులతో అదరకొట్టేస్తుంది. బహుశా వాళ్ళ మధ్య ఉన్న చనువు కూడా ఇందుకు కారణం కావచ్చు.