Project K Poster : స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే టైటిల్ తో పాటుగా గ్లింప్స్ కూడా శాన్ డియాగో కామికాన్ లో రిలీజ్ చేయటం జరిగింది. ఈ సినిమాకు కల్కి అనే టైటిల్ పెట్టారు. ఈ భారీ బడ్జెట్ మూవీ కి ఎన్నో టైటిల్స్ అనుకున్న కానీ చివరికి “కల్కి 2898 AD టైటిల్ ఫిక్స్ చేశారు. ఇక రిలీజ్ అయిన గ్లింప్స్ కు వరల్డ్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వస్తుంది. హాలీవుడ్ రేంజ్ కి ఏ మాత్రం తగ్గని రీతిలో ఈ సినిమా విజువల్స్ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.
ఇక ఈ సినిమా పోస్టర్ విషయానికి వస్తే, టైటిల్ కంటే ముందే ప్రభాస్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే, ఐరన్ మాన్ తరహాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ విడుదలైన వెంటనే మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. సగటు ప్రేక్షకులతో పాటుగా ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కొంచెం నిరాశ చెందిన మాట వాస్తవమే, కానీ గ్లింప్స్ రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ లుక్ మీద వచ్చిన నెగిటివ్ టాక్ పక్కకు వెళ్లి పోవడమే కాకుండా ఫస్ట్ లుక్ మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడం విశేషం.
ఈ ఫస్ట్ లుక్ లో ప్రభాస్ సరికొత్తగా కనిపించిన విషయం తెలిసిందే, ఈ పోస్టర్ ని నిఖిల్ అనుదీప్ అనే గ్రాఫిక్ డిజైనర్ తయారుచేశాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్ లో వస్తున్న OG సినిమా పోస్టర్, హీరో నితిన్, రష్మిక నటిస్తున్న మూవీ పోస్టర్ కూడా ఇతనే డిజైన్ చేయటం జరిగింది. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలా వరకు పెద్ద సినిమా పోస్టర్స్ కు నిఖిల్ అనుదీప్ వర్క్ చేస్తున్నట్లు సమాచారం.
“కల్కి 2898 AD” అనేది వరల్డ్ వైడ్ సినిమా, కాబట్టి హాలీవుడ్ మార్కెట్ ను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ సినిమా పోస్టర్స్ అనేవి డిజైన్ చేయాల్సి ఉంటుంది. అమెరికా వేదికగా మొదలైన కల్కి ప్రచార పర్వం మెల్లమెల్లగా వరల్డ్ మొత్తం చుట్టి వచ్చే అవకాశం ఉంది. దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది 2024 కి విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ముందుగా అనుకున్నట్లు సంక్రాంతికి వచ్చే అవకాశం తక్కువే అని చెప్పాలి. అందుకే విడుదల తేదీ లేకుండా 2024 అని మాత్రమే చిత్ర యూనిట్ ప్రకటించింది..