Ravi Teja and Srileela : యంగ్ బ్యూటీ శ్రీలీల ఈరోజు ఇండస్ట్రీ లో ఈ స్థాయిలో ఉందంటే అందుకు కారణం రవితేజతో కలిసి ఆమె చేసిన ‘ధమాకా’ చిత్రం వల్లే అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి సినిమా ‘పెళ్లి సందడి’ తో మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ, ఆమె డ్యాన్స్ కి కుర్రాళ్ళు పిచ్చెక్కిపోయేలా తయారైంది మాత్రం ‘ధమాకా’ చిత్రంతోనే. ఒక విధంగా చెప్పాలంటే ఆ సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం శ్రీలీల వేసిన డ్యాన్సులే అని అనేవాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి శ్రీలీల మళ్ళీ రవితేజ తో రెండవసారి జత కట్టిన చిత్రం ‘మాస్ జాతర’. భాను భోగవరాజు అనే కొత్త దర్శకుడితో తీసిన ఈ చిత్రంలో శ్రీలీల హీరోయిన్ గా నటించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. రీసెంట్ గానే రవితేజ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ చిత్రం నుండి శ్రీలీల తప్పుకున్నట్టు లేటెస్ట్ గా వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఇటీవల కాలం లో శ్రీలీల డేట్స్ ని ముందు వెనుక చూసుకోకుండా అడ్వాన్స్ లు తీసుకుంటుంది. ఆ తర్వాత నిర్మాతలకు డేట్స్ అవసరమైనప్పుడు టార్చర్ చూపించేస్తుంది. విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి కూడా ఇదే సమస్య తలెత్తింది. ఆ తర్వాత ఈమె నవీన్ పోలిశెట్టి కొత్త చిత్రం ‘అనగనగ ఒక రాజు’ నుండి కూడా ఇదే సమస్యతో తప్పుకుంది. ఆమె స్థానంలోకి ఇప్పుడు మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ‘మాస్ జాతర’ నుండి కూడా ఆమెని తప్పించేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటి వరకు ఈ చిత్రం కోసం ఆమె 14 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించింది.
ఇంకా 20 రోజుల కాల్ షీట్స్ అవసరం ఉంది. కానీ ఆమె రీసెంట్ గానే శివ కార్తికేయన్ హీరో గా నటిస్తున్న ‘పరాశక్తి’ చిత్రానికి బల్క్ గా డేట్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పుడు ఆమె ‘మాస్ జాతర’ కి డేట్స్ కేటాయించలేకపోతుందట. నిర్మాతలు ఆమెని తప్పించి వేరే హీరోయిన్ తో ఈ సినిమా చేయాలనీ చూస్తున్నారు. రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన భాగ్యశ్రీ భోర్సే ని ఈ సినిమా కోసం తీసుకోవాలని చూస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి క్లారిటీ త్వరలోనే రానుంది. ఈ సినిమాతో పాటు శ్రీలీల అఖిల్ తో కూడా ఒక చిత్రం చేస్తుంది. దానికి కూడా కాల్ షీట్స్ సమస్య రావడంతో ఆమెని తప్పించే పనిలో ఉన్నారట మేకర్స్. ఇలా శ్రీలీల సరైన ప్లానింగ్ చేసుకోకపోవడం వల్ల, తన కెరీర్ ని నాశనం చేసుకుంటుంది అంటూ ఆమె అభిమానులు బాధపడుతున్నారు.