Madagaja Raja Movie Review : సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ల కంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక తమిళంలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న విశాల్ (Vishal) తెలుగులో కూడా చాలా మంచి మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నాడు. ముఖ్యంగా పందెం కోడి(Pandem Kodi), పొగరు (Pogaru) లాంటి సినిమాలతో వరుసగా మంచి విజయాలను సాధించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరి విశాల్ నటించిన మద్దగజరాజా (Madagaja raja) అనే సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకులను మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే విశాల్ ఒక మ్యారేజ్ ఫంక్షన్ లో తన చిన్ననాటి స్నేహితులను కలుస్తాడు. వాళ్లు కొన్ని ప్రాబ్లమ్స్ లో ఉన్నారని తెలుసుకున్న విశాల్ వాళ్ల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రాసెస్ లోనే తనకు వరలక్ష్మి శరత్ కుమార్, అంజలీలతో ఎలా పరిచయమైంది. కొంతమంది రౌడీలు విశాల్ ను చంపాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు. విశాల్ ఫ్రెండ్స్ కి ఉన్న ప్రాబ్లం ఏంటి విశాల్ వాటిని సాల్వ్ చేశాడా లేదా అనే విషయాలు మీకు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు సి సుందర్ ఈ సినిమాని చాలా ఎక్స్ట్రాడినరీగా తెరకెక్కించడనే చెప్పాలి. సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిన 13 సంవత్సరాల తర్వాత సినిమా రిలీజ్ అయినప్పటికి ఈ సినిమాలో ఫన్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఈ మధ్యకాలంలో వస్తున్న క్రింజ్ కామెడీని దాటి సంతానం లాంటి ఒక కమెడియన్ చేసిన వన్ లైన్ ఆర్డర్ కామెడీ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా పేలిందనే చెప్పాలి. ప్రేక్షకులు ఆ కామెడీకి చాలా ఎంజాయ్ చేస్తూ నవ్వుకుంటున్నారు…
ఇక కథ రొటీన్ ఫార్మాట్ లో సాగుతున్నప్పటికి సీన్లను మనం ఎస్టిమేట్ చేసే విధంగా ఉన్నప్పటికి కామెడీ మాత్రం హైలెట్ గా నిలిచింది. ఇక విశాల్ యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఈ సినిమాకు అది చాలా బాగా ప్లస్ అయిందనే చెప్పాలి. అయితే కొన్ని ఎమోషన్ సీన్స్ పండించడంలో విశాల్ చాలా మంచి నటనని కనబరిచాడు. ఒకప్పుడు ఆయన చేసిన పందెంకోడి, పొగరు సినిమాలో నటనను గుర్తు చేస్తూ చాలా బాగా ఎక్స్ట్రాడినర్ గా నటించాడు. ముఖ్యంగా ఈ సినిమాలో ఒక ఎమోషన్ ని హుక్ చేసే సన్నివేశాలైతే ఉన్నాయి. వాటిలో నెక్స్ట్ లెవెల్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చాడు… అలాగే ఈ సినిమాను చూసే ప్రేక్షకుడిని అయితే నిరాశ పడకుండా సినిమా మొత్తం ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంటుంది…ఇక సంతానం తన కామెడీతో సినిమాని ముందుకు తీసుకెళ్లిన వైఖరి కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంది.
ఇక సి సుందర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్న నేపధ్యంలో ఈ సినిమా మీద ఆయన చాలా మంచి కేర్ తీసుకొని 13 ఏళ్ల క్రితం ఈ సినిమా పూర్తి అయినప్పటికి రిలీజ్ కి ముందు కొన్ని చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసినట్టుగా కూడా మనకైతే చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమా కథ పాతదే అయినప్పటికీ కథనంలో మాత్రం కొంతవరకు కొత్తదనాన్ని వాడారు…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విశాల్ తన నట విశ్వరూపాన్ని చూపించాడనే చెప్పాలి. పందెంకోడి టైమ్ లో ఉన్న వింటేజ్ విశాల్ ని మనం ఈ సినిమాలో చూడొచ్చు… ఇక హీరోయిన్స్ అయిన వరలక్ష్మి శరత్ కుమార్ అంజలి పాత్రలు వాళ్ల పాత్రల మేరకు పరిమితంగా ఉన్నప్పటికి వాళ్లకు లభించిన పాత్రలకు వాళ్ళు చాలా బాగా న్యాయం చేశారనే చెప్పాలి. ఇక సంతానం అయితే తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను గిలిగింతలు పెట్టించాడు. ముఖ్యంగా సంతానం ఈ సినిమాను ముందుగు తీసుకెళ్లడం లో చాలా కీలక పాత్ర వహించాడు. ఇక వీళ్ళతో పాటుగా మిగిలిన ఆర్టిస్టులు సైతం వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ మాత్రం చాలా అద్భుతంగా కుదిరిందనే చెప్పాలి. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం చాలా కేర్ తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కొన్ని ఇంపారెంట్ సీన్స్ లో బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే చాలా బాగా అందించే ప్రయత్నం చేశారు. మరి ఏది ఏమైనా కూడా మ్యూజిక్ సినిమాలో సిచువేషన్ కి తగ్గట్టుగా ప్రతి ఎమోషన్ ని ఎలివేషన్ ని క్యాచ్ చేసుకుంటూ ముందుకు సాగింది కాబట్టి మ్యూజిక్ అనేది ఈ సినిమాకి ప్రాణం పోసిందనే చెప్పాలి… ఇక ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకులను నిరాశపరిచినప్పటికి సినిమా ఫ్లో అనేది వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి విజువల్స్ పెద్దగా ప్రేక్షకుడిని ప్రభావితం చేసే పరిస్థితి అయితే లేదనే చెప్పాలి. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విజువల్స్ సీరియల్ ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంటాయి… ఇక ఎడిటింగ్ కూడా సీరియల్ ఫార్మాట్లోనే సాగుతూ ఉండటం సినిమా మీద మధ్యమధ్యలో కాస్త చిరాకు తెప్పించినట్టు అనిపించినప్పటికి దర్శకుడు ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లిన విధానం చాలా బాగుంది…
ప్లస్ పాయింట్స్
విశాల్
కామెడీ సీన్స్
మ్యూజిక్
మైనస్ పాయింట్స్
కథ
విజువల్స్
ఎడిటింగ్
రేటింగ్
ఈ సినిమాకి మేమిచ్చే రేటింగ్ 2.5/5