KJQ Movie: దసరా సినిమాతో దర్శకుడిగా తనకంటూ ఒక గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇకమీదట చేయబోయే సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం నాని ని హీరోగా పెట్టి ప్యారడైజ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు దూసుకెళ్తున్నాడు.
ఇలాంటి క్రమంలోనే శ్రీకాంత్ డైరెక్టర్ గా సెటిల్ అయిన తర్వాత తన తమ్ముడైన శశి ని సైతం హీరోను చేయాలని మొదటి నుంచే ప్రణాళికతో ఉన్న శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు KJQ అనే సినిమాతో వాళ్ళ తమ్ముడిని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాకి కేకే అనే డైరెక్టర్ దర్శకత్వ భాద్యతలను చేపట్టడం విశేషం…
గతంలో ఆయన నాగార్జున తో కేడి అనే సినిమా చేశాడు. అయితే గత కొద్దిరోజుల క్రితం ఆయన అనారోగ్య కారణంగా చనిపోయాడు. దాంతో శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా బాధ్యతను తీసుకొని తనే స్వయంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నాడు…ఇక తొందరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఆయన సన్నాహాలు చేస్తుండడం విశేషం…
ఇక ఏది ఏమైనా కూడా శ్రీకాంత్ ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడో తన తమ్ముడు కూడా అదే మాదిరిగా స్టార్ హీరోగా మారతాడా? లేదా అనేది ఈ సినిమా డిసైడ్ చేయబోతుందని మరి కొంతమంది కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం… ఇక ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమా చేసిన రాని గుర్తింపు శ్రీకాంత్ తనకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోగలుగుతాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఒకవేళ ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లోనే తన తమ్ముడిని హీరోగా పెట్టి ఒక సినిమా చేసే అవకాశాలైతే ఉన్నట్టుగా తెలుస్తుంది…
