Homeఎంటర్టైన్మెంట్Srikanth iyengar: ఆ సినిమాలో అంత నీచమైన పాత్ర చేశానని అంటున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్

Srikanth iyengar: ఆ సినిమాలో అంత నీచమైన పాత్ర చేశానని అంటున్న నటుడు శ్రీకాంత్ అయ్యంగార్

Srikanth iyengar: శ్రీకాంత్ అయ్యంగార్ అంటే తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియక పోవచ్చు. కానీ చూసిన వెంటనే ఆయనే కదా అని గుర్తు పట్టే పాత్రల్లో నటించి మెప్పించారు. ఇటీవల సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజు పండుగ చిత్రంలో తండ్రి బతికి ఉండగానే సమాధి కట్టించే సీన్‌లో నవ్వులు పూయించారు. ఇక కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, డియర్ కామ్రేడ్, బ్రోచేవారెవరురా తదితర చిత్రాల్లో విలక్షణ నటుడిగా పేరొందారు. ఈయన తాజాగా నటిస్తున్న చిత్రం 1997.  నవీన్ చంద్ర, డా.మోహన్, కోటి ఈ మూవీలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి డా.మోహన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

srikanth iyengar interesting words about his role in 1997 movie

ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. కాగా అందులో అవినీతి పోలీస్ అధికారిగా భిన్నమైన పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటించారు. ఈ మేరకు తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో సినిమాకు సంబంధించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శ్రీకాంత్. నా నలభై ఏడేళ్లకు నాకు సినిమా ఇండస్ట్రి లో  బ్రేక్ వచ్చింది. ముఖ్యంగా బ్రోచేవారెవరురా సినిమాతో నాకు మంచి సక్సెస్ దక్కింది. ఆ తరువాత పలు సినిమాల్లో భిన్నమైన పాత్రల్లో చేస్తున్నాను. ఒకసారి నేను షూటింగ్‌ చేస్తున్న సమయంలో మోహన్‌ గారు సెట్స్‌కు వచ్చి కథ చెప్పారు. కథ నచ్చడంతో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాను.

young hero naveen chandra 1997 movie release date fixed

అమ్మాయిపై అత్యాచారం చేసి, పెట్రోల్‌ పోసి తగులబెట్టడం వంటి నేరాల నేపథ్యంలో 1997 సినిమా ఉంటుంది అన్నారు. నా పాత్రకు డబ్బింగ్‌ చెప్తున్నప్పుడు నాకే ఛీ అనిపించింది. అంత నీచమైన పాత్ర ఈ సినిమాలో నటించాను అని తెలిపారు. అలానే చిత్ర పరిశ్రమలో నా గాడ్ ఫాదర్ వర్మ గారే అని చెబుతున్నారు శ్రీకాంత్.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular