https://oktelugu.com/

Srikanth: ఊహ కంటే ముందు ఆ హీరోయిన్ తో ఎఫైర్ లో శ్రీకాంత్… పెళ్లి ఎందుకు కాలేదు!

Srikanth: టాలీవుడ్ అందమైన ఫ్యామిలీస్ లో శ్రీకాంత్ కుటుంబం ఒకటి. శ్రీకాంత్ హీరోయిన్ ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు. కన్నడ అమ్మాయి అయిన ఊహా ఆమె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె సూపర్ హిట్ కావడంతో ఊహ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమెలో నరేష్, శ్రీకాంత్ హీరోలుగా నటించారు. మరి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారేమో కానీ కలిసి ఎక్కువ చిత్రాలు చేయకపోయినా వివాహం చేసుకున్నారు. 1997లో శ్రీకాంత్-ఊహ ఘనంగా చిత్ర ప్రముఖుల సమక్షంలో పెళ్లి […]

Written By:
  • Shiva
  • , Updated On : October 2, 2023 / 06:53 PM IST
    Follow us on

    Srikanth: టాలీవుడ్ అందమైన ఫ్యామిలీస్ లో శ్రీకాంత్ కుటుంబం ఒకటి. శ్రీకాంత్ హీరోయిన్ ఊహను ప్రేమ వివాహం చేసుకున్నారు. కన్నడ అమ్మాయి అయిన ఊహా ఆమె చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆమె సూపర్ హిట్ కావడంతో ఊహ ఓవర్ నైట్ స్టార్ అయ్యింది. ఆమెలో నరేష్, శ్రీకాంత్ హీరోలుగా నటించారు. మరి తొలిచూపులోనే ప్రేమలో పడ్డారేమో కానీ కలిసి ఎక్కువ చిత్రాలు చేయకపోయినా వివాహం చేసుకున్నారు. 1997లో శ్రీకాంత్-ఊహ ఘనంగా చిత్ర ప్రముఖుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

    వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు అబ్బాయిలు, ఓ అమ్మాయి. పెద్ద కొడుకు రోషన్ ఆల్రెడీ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఊహ కంటే ముందే శ్రీకాంత్ మరో హీరోయిన్ ని ప్రేమించాడట. విలన్, సెకండ్ హీరో రోల్స్ చేస్తున్న శ్రీకాంత్ ని తాజ్ మహల్ మూవీ హీరోగా నిలబెట్టింది. ఈ చిత్రంలో మోనికా బేడీ హీరోయిన్. సంఘవి మరో హీరోయిన్ గా నటించింది. శ్రీకాంత్-సంఘవి కాంబినేషన్ లో వరుస చిత్రాలు వచ్చాయి.

    పిల్ల నచ్చింది, మాణిక్యం, ప్రేయసి రావే చిత్రాలు చేశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ పుకార్లు లేచాయి. సంఘవితో లవ్ ఎఫైర్ వార్తలు ఊపందుకుంటున్న తరుణంలో శ్రీకాంత్ తన ప్రియసిగా సంఘవిని పరిచయం చేశాడు. దాంతో పుకార్లు వీగిపోయాయి. అదన్న మాట మేటర్. పరిశ్రమలో ఇవన్నీ సాధారణంగా. ఓ హీరో హీరోయిన్ కలిసి నాలుగు చిత్రాలు చేస్తే ఎఫైర్ అంటూ కథనాలు వల్లిస్తారు.

    ప్రస్తుతం శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్, విలన్ రోల్స్ చేస్తున్నారు. అఖండ మూవీలో కరుడుగట్టిన విలన్ పాత్రలో మెప్పించాడు. వారసుడు లో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర చేశాడు. లేటెస్ట్ రిలీజ్ స్కందలో కీలక రోల్ చేశాడు. నెక్స్ట్ గేమ్ ఛేంజర్, దేవర వంటి భారీ చిత్రాల్లో ఆయన నటిస్తున్నట్లు సమాచారం. కొడుకు రోషన్ ని హీరోగా నిలబెట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు.