Bigg Boss 6 Telugu- Srihan: ఈ సీజన్ ప్రారంభం అయ్యినప్పటి నుండి హౌస్ లో అందరికంటే అత్యధిక ఓట్లతో కొనసాగుతూ వస్తున్నా కంటెస్టెంట్స్ కేవలం ఇద్దరు మాత్రమే..ఒకరు రేవంత్ అయితే మరొకరు శ్రీహాన్..రేవంత్ మరియు శ్రీహాన్ ఒకటి రెండు వారాలు తప్ప..మిగిలిన అన్ని వారాలలో నామినేషన్స్ లో ఉంటూ వస్తున్నారు..రేవంత్ మొదటి స్థానం లో కొనసాగితే..శ్రీహాన్ రెండవ స్థానం లో కొనసాగుతూ ఉండేవాడు..కానీ ఈమధ్య శ్రీహాన్ గ్రాఫ్ తగ్గడం.

అదే సమయం లో ఇనాయ సుల్తానా గ్రాఫ్ అమాంతం పెరిగిపోవడం అందరిని షాక్ కి గురి చేస్తున్న అంశం..ఇనాయ బెస్ట్ ఫ్రెండ్ సూర్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత నుండి ఇనాయ గ్రాఫ్ ఎవ్వరు ఊహించని రేంజ్ కి పెరిగిపోయింది..ప్రస్తుతం ఆమె శ్రీహాన్ స్థానం కి ఎసరు పెట్టేసినట్టు తెలుస్తుంది..సూర్య ఎలిమినేట్ అయిపోయిన తర్వాత ‘నీ వల్లే సూర్య వెళ్ళిపోయాడు’ అని ఇనాయ ని ప్రాజెక్ట్ చేసిన ఇంటి సభ్యులలో శ్రీహాన్ కూడా ఒకడు..అందుకే ఆయన గ్రాఫ్ పడిపోయిందని చెప్తున్నారు విశ్లేషకులు.
ఇక ఇనాయ ని అంత వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నప్పటికీ ఏ మాత్రం ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఆడపులి లాగ మగవాళ్ళతో పోటీ పడుతూ ఫిజికల్ టాస్కులు ఆడడం చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు..అందుకే ఆమెకి సపోర్ట్ ఈమధ్య కాలంలో ఎవ్వరు ఊహించని రేంజ్ కి చేరిపోయింది..ప్రస్తుతం ఆమె రేవంత్ తర్వాత రెండవ స్థానం లో కొనసాగుతుంది..ఈ వారం టాస్కులు అద్భుతంగా ఆడితే రేవంత్ ని భారీ మార్జిన్ తో క్రాస్ చేసి నెంబర్ 1 స్థానం కి ఇనాయ చేరుకున్నా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదని చెప్తున్నారు విశ్లేషకులు.

ఇప్పటి వరుకు తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో 5 సీజన్స్ పూర్తి అయితే..ఈ 5 సీజన్స్ మగవాళ్లే బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకున్నారు..కానీ ఇప్పుడు సీజన్ 6 లో ఒక అమ్మాయి బిగ్ బాస్ టైటిల్ ని గెలుచుకొని చరిత్ర సృష్టించబోతోందా లేదా అనేది చూడాలి.