https://oktelugu.com/

Sridevi Soda Center: హీరో సుధీర్ బాబు తినే కంచంలో ఉమ్మేశాడు.. వైరల్ వీడియో

Sridevi Soda Center: ఇటీవలే విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center) మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు(Sudheer Babu) నటన ఆకట్టుకునేలా ఉందని..బాగా నటించాడన్న పేరు వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాల్లో రక్తికట్టించాడని చెబుతున్నారు. ‘పలాస’ దర్శకుడు తీసిన ఈ కులాల కుంపట్ల లవ్ స్టోరీపై పాజిటివ్ స్పందనే వచ్చింది. అయితే సినిమా ఎంత బాగా తీసినా దాని నిడివి పెద్దవి అయితే మంచి సీన్లు కూడా కట్ […]

Written By: , Updated On : August 30, 2021 / 01:37 PM IST
Follow us on

Sridevi Soda Center movie Deleted Scenes

Sridevi Soda Center: ఇటీవలే విడుదలైన శ్రీదేవి సోడా సెంటర్ (Sridevi Soda Center) మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాలో సుధీర్ బాబు(Sudheer Babu) నటన ఆకట్టుకునేలా ఉందని..బాగా నటించాడన్న పేరు వచ్చింది. ఎమోషనల్ సన్నివేశాల్లో రక్తికట్టించాడని చెబుతున్నారు. ‘పలాస’ దర్శకుడు తీసిన ఈ కులాల కుంపట్ల లవ్ స్టోరీపై పాజిటివ్ స్పందనే వచ్చింది.

అయితే సినిమా ఎంత బాగా తీసినా దాని నిడివి పెద్దవి అయితే మంచి సీన్లు కూడా కట్ చేసి తీసేస్తారు. ఈ క్రమంలోనే ‘శ్రీదేవి సోడా సెంటర్’ మూవీ నుంచి కూడా కొన్ని ఒళ్లు గగుర్పొడే సన్నివేశాలను తొలిగించారట.. తాజాగా సినిమా మంచి టాక్ సొంతం చేసుకోవడంతో తొలగించిన ఆ డిలేటెడ్ సీన్లను తాజాగా యూట్యూబ్ లో విడుదల చేశారు.

తాజాగా ‘శ్రీదేవి సోడా సెంటర్’ నుంచి తొలగించిన జైల్లోని ఒక మంచి సీన్ ను రిలీజ్ చేశారు.విలన్ అజయ్ హీరో సుధీర్ వద్దకు వచ్చి కోర్టుకు వెళ్లినప్పుడు ఎందుకు మా వాళ్లు ఇచ్చిన డ్రగ్స్ పొట్లాలు తీసుకురాలేదని.. అతడు తినే కంచంలో ఉమ్మేస్తాడు.. ఎంతో సీరియస్ గా సుధీర్ బాబు చూస్తూ కోపాన్ని అణిచివేసుకునే సీన్ ఆద్యంతం ఎమోషనల్ గా ఉంది. సుధీర్ ఎందుకు మౌనంగా ఉన్నాడన్నది ఇందులో చూపించలేదు. సుధీర్, అజయ్ ఇద్దరూ తమ సీరియస్ లుక్ లో మెప్పించారు.

ఈ సీన్ ఉంటే ఇంకా బాగుండేది చూసిన వారంతా ప్రశంసిస్తున్నారు. ‘శ్రీదేవి సోడా సెంటర్ ’నుంచి తొలగించిన ఈ సీన్ ను మీరూ చూడండి..

Deleted Scene - 1 | Sridevi Soda Center | Sudheer Babu | Anandhi | Karuna Kumar | Mani Sharma