https://oktelugu.com/

Sridevi Drama Company: అమ్మో రష్మీ ఇంత ముదురా, సుడిగాలి సుధీర్ డబ్బులన్నీ లాగేస్తుందా… కీలక విషయం వెలుగులోకి!

రష్మీ గౌతమ్ అంటే సుడిగాలి సుధీర్ కి ఎంత ఇష్టమో చెప్పేందుకు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఆమె ఫోన్ చేసి డబ్బులు అడిగిందే తడవుగా పంపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Written By:
  • S Reddy
  • , Updated On : October 8, 2024 / 04:22 PM IST

    Sridevi Drama Company

    Follow us on

    Sridevi Drama Company: రష్మీ గౌతమ్-సుడిగాలి సుధీర్ బుల్లితెర లవ్ బర్డ్స్. దశాబ్దానికి పైగా వీరి ప్రేమాయణం సాగింది. జబర్దస్త్ వేదికగా మొదలైన కెమిస్ట్రీ.. ఢీ డాన్స్ రియాలిటీ షో, శ్రీదేవి డ్రామా కంపెనీలో మరింత బలపడింది. రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ లకు ఒకటి రెండుసార్లు ఉత్తుత్తి పెళ్లి కూడా జరిగింది. వీరిద్దరూ కలిసి చేసిన రొమాంటిక్ సాంగ్స్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశాయి. అసలు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ నిజంగానే ప్రేమికులేమో అనే సందేహం లేకపోలేదు.

    పలు ఇంటర్వ్యూలలో వారిద్దరికి ఈ ప్రశ్న ఎదురైంది. అయితే తాము మంచి స్నేహితులమే. అంతకు మించి మా మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. మా లవ్ ఆన్ స్క్రీన్ వరకు మాత్రమే పరిమితం అని సమాధానం చెప్పారు. అలాగే మీరెప్పుడు కలిసి మూవీ చేస్తారని అడిగితే… చర్చలు జరిగాయి. కానీ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదని సమాధానం చెప్పారు.

    ఇదిలా ఉండగా… రష్మీ గౌతమ్ కి ఒక పరీక్ష ఎదురైంది. శ్రీదేవి డ్రామా కంపెనీ లేటెస్ట్ ఎపిసోడ్లో హైపర్ ఆది ఒక టాస్క్ పెట్టాడు. అందరి మొబైల్ ఫోన్స్ తీసుకున్న హైపర్ ఆది. ఎవరో ఒకరికి ఫోన్ చేసి రూ. 10 వేలు అడిగాలి. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలన్నారు. బుల్లెట్ భాస్కర్ వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి… నాన్న పది వేలు కావాలి అన్నాడు. మళ్ళీ ఫోన్ చేస్తా… అని పెట్టేశాడు. అనంతరం రష్మీ వంతు వచ్చింది.

    సుడిగాలి సుధీర్ కి ఫోన్ చేసి పది వేలు అడగాలని హైపర్ ఆది రష్మీ గౌతమ్ కి చెప్పాడు. ఆమె ఫోన్ చేయగానే… హే చెప్పారా, అన్నాడు సుడిగాలి సుధీర్. నాకు అర్జెంటు గా పది వేలు కావాలని ఆమె అడిగింది. ఫోన్ పే నా లేక గూగుల్ పేనా అని అడిగాడు. ఫోన్ పెట్టేసే లోపే డబ్బులు కొట్టాడు. దాంతో సెట్ లోని వారందరూ షాక్ అయ్యారు. ఈ ప్రోమో వైరల్ అవుతుంది.

    ఈ క్రమంలో రష్మీ గౌతమ్ మామూలుది కాదు. సుడిగాలి సుధీర్ దగ్గర డబ్బులు మెల్లగా లాగేస్తుంది కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు బుల్లితెర ఆడియన్స్ ఈ జంటను మిస్ అవుతున్నారు. సుడిగాలి సుధీర్ జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ చేయడం లేదు. దాంతో గతంలో మాదిరి వీరి మధ్య రొమాన్స్ చోటు చేసుకోవడం లేదు.