Homeఎంటర్టైన్మెంట్Arjuna Phalguna: ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో శ్రీ విష్ణు మేకింగ్ డైరీస్

Arjuna Phalguna: ఆకట్టుకుంటోన్న యంగ్ హీరో శ్రీ విష్ణు మేకింగ్ డైరీస్

Arjuna Phalguna: “ఉన్నది ఒకటే జిందగీ” సినిమా లో ఫ్రెండ్ పాత్రలో మెప్పించి ఆ తర్వాత హీరోగా బ్రోచేవారెవరురా,గాలి సంపత్, వంటి చిత్రాలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు టాలెంటెడ్ యంగ్ హీరో శ్రీ విష్ణు. కొత్త దర్శకుడు తేజ మార్ని దర్శకత్వంలో హీరో శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ జంటగా తెరకెక్కిస్తున్న థ్రిల్లర్ చిత్రం “అర్జున ఫల్గుణ”. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంగా నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ డిసెంబర్ 31న థియేటర్ లో విడుదలకు సిద్ధంగా ఉంది.ఈ సినిమా మరో పదకొండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ‘అర్జున ఫల్గుణ’ మేకింగ్ డైరీస్ పేరుతో వాల్యూమ్ 1 వీడియో ను విడుదల చేశారు యూనిట్ బృందం.

Arjuna Phalguna Making Diaries, Vol-1 | Sree Vishnu, Amritha  | Teja Marni | Matinee Entertainment

“అర్జున ఫల్గుణ” సినిమా మొత్తం గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిందని మేకింగ్ వీడియో చూస్తే అర్ధమవుతుంది.ఈ సినిమా కథాంశం ఏమిటంటే తూర్పుగోదావరి జిల్లా నుంచి పట్నం వచ్చిన ఓ నలుగురు మిత్రులు అనుకోని రీతిలో ఓ సమస్యలో ఇరుక్కుంటారు. చివరికి హీరో, అతని స్నేహితులు ఆ సమస్య నుంచి ఎలా బైటపడ్డారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో క్రైమ్ థ్రిల్లర్ గా ఈ సినిమా అలరించబోతోంది.

Also Read: మళ్ళీ కలిపేసుకుంటున్నారు, ఒక్క ఎన్టీఆర్ ను తప్ప!

టీజర్, ట్రైలర్ ప్రామిసింగ్ గా ఉండడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీవిష్ణు ఇటీవలే “రాజ రాజ చోర” చిత్రం సాలిడ్ హిట్ అందుకోవడంతో ఈ చిత్రంపై కూడా ప్రేక్షక అభిమానులలో ఎక్స్పెక్టేషన్స్ బాగానే పెరుగుతున్నాయి అనే చెప్పాలి.. చూడాలి మరి ఈ చిత్రం శ్రీవిష్ణు కు ఎలాంటి విజయాన్ని అందించనుంది తెలియాలంటే డిసెంబర్ 31 వరకు ఆగాల్సిందే.

Also Read: ఆర్​ఆర్​ఆర్​లో ఆ ఒక్క సీన్​ అరుపులే అంటున్న రాజమౌళి

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version