Sri Reddy – Chiranjeevi Mother: శ్రీరెడ్డి అంటేనే వివాదాస్పద వ్యాఖ్యలకు పర్యాయపదం అయిపోయింది. ఆ స్థాయిలో శ్రీరెడ్డి పేరు మోసింది. టాలీవుడ్ కాస్టింగ్ కౌచ్ పేరుతో ఫామ్ లోకి వచ్చిన శ్రీరెడ్డి గతంలో పలువురు టాలీవుడ్, కోలీవుడ్ చెందిన ప్రముఖుల పై సంచలన మరియు అతి దారుణమైన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో మెగాస్టార్ తల్లిగారు అంజనాదేవిని కూడా తిట్టి సంచలనంగా వ్యతిరేకతను కూడా ఎదుర్కొంది శ్రీరెడ్డి.

అయితే, ఇప్పుడు తన తప్పును ఒప్పుకుంది. తాను అంజనాదేవిని అలా అనకుండా ఉండాల్సిందని ట్విట్టర్‌లో వీడియో రూపంలో చెప్పకొచ్చింది. ఆడవాళ్ల కోసం తాను చేసిన ఉద్యమంలో ఓ పెద్ద మనిషి సలహా మేరకు అలా తిట్టాల్సి వచ్చిందని, ఈ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నట్టు తెలిపింది. ఈ క్రమంలో అంజనమ్మను తిట్టి తప్పు చేశాను, పెద్ద మనసు చేసుకొని తనను క్షమించాలని శ్రీరెడ్డి కోరింది.
మరి శ్రీరెడ్డిలో సడెన్ గా ఇంతమార్పు ఎందుకు వచ్చిందో తెలియదు. నిజానికి శ్రీరెడ్డి గతంలో మెగా కుటుంబంపై నిప్పులు చెదిగింది. అయితే ఇన్నాళ్ల తర్వాత శ్రీరెడ్డి ఈ వివాదంపై స్పందించింది. మరి అంజనాదేవికి క్షమాపణలు తెలుపుకుంటున్నట్టు సోషల్ మీడియా సాక్షిగా వెల్లడించిన శ్రీరెడ్డి.. ప్రస్తుతం ఫుల్ పశ్చాత్తాపం చెందుతుందట. మరి అంజనా దేవి గారు పెద్ద మనసుతో క్షమిస్తారా ? చూడాలి.

మొత్తానికి శ్రీరెడ్డి చాలా వివాదాలే ఉన్నాయి. ఆ వివాదాలకు ఇబ్బంది పడిన వారిలో పవన్ కళ్యాణ్ దగ్గర నుండి టాలీవుడ్ టాప్ దర్శకుడు కొరటాల శివ వరకూ ఉన్నారు. ఏమైనా శ్రీ రెడ్డి ఆరోపణల లిస్ట్ లో చాలా మంది ప్రముఖులు ఉండటంతో అప్పట్లో వీటి పై పెద్ద దుమారం లేచింది.
Also Read: Chiranjeevi CM Dream: చిరంజీవి సీఎం కల.. అసలు ఎలా పుట్టింది?
[…] […]
[…] […]