Chiranjeevi, Prabhas and Maruthi: మారుతి ఏమి చేసినా బిజినెస్ పరంగా మంచి లాభాలు వచ్చే విధంగా చేస్తాడు. పైగా నిర్మాతలకు లాభాలు వచ్చే సినిమాలే చేస్తాడు. కింద స్థాయి నుంచి రావడంతో మారుతికి మాస్ పల్స్ బాగా తెలుసు. అందుకే, మారుతితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా సముఖంగా ఉంటున్నారు. నిజం చెప్పాలంటే డైరెక్టర్ గా మారుతి బాగా సక్సెస్ అయినా.. ఇప్పటివరకు ఏ స్టార్ హీరో డేట్స్ ఇవ్వలేదు. ఒక్క వెంకటేష్ మాత్రమే డేట్స్ ఇచ్చాడు.

Chiranjeevi maruthi
కానీ, వెంకీతో మారుతి పెద్ద డిజాస్టర్ చేశాడు. కానీ ‘ప్రతిరోజూ పండగే’ సినిమాతో భారీ విజయం సాధించి మొత్తానికి తనలో మ్యాటర్ ఉందని బలంగా నిరూపించుకున్నాడు. ప్రస్తుతం గోపీచంద్ హీరోగా “పక్కా కమర్షియల్” అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా అవుట్ ఫుట్ అద్భుతంగా వచ్చిందని.. అందుకే, ప్రభాస్ కూడా మారుతితో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్తలు వస్తున్నాయి.

Prabhas Maruthi
అలాగే మెగాస్టార్ చిరంజీవి కూడా మారుతితో సినిమా చేసేందుకు ఓకే చెప్పారని ఆ మధ్య పుకార్లు వినిపించాయి. మొత్తమ్మీద మారుతి మాత్రం తన తదుపరి చిత్రాల గురించి ఊహాగానాలు వద్దు అని మీడియాకి క్లారిటీగా చెబుతున్నాడు. పైగా ఈ సారి తన కెరీర్ గ్రాఫ్ పెరిగే సినిమానే చేస్తాను అంటూ హింట్ కూడా ఇస్తున్నాడు. కాకపోతే సమయం వచ్చినప్పుడు అన్ని చెప్తాను అంటున్నాడు.
Also Read: Prabhas new look: వైరల్ అవుతున్న ప్రభాస్ కొత్త లుక్ !
మరి ఆ సమయం ఎప్పుడు వస్తోందో చెప్పలేదు. ఏది ఏమైనా మెగాస్టార్ గానీ, ప్రభాస్ గాని మారుతికి ఛాన్స్ ఇస్తే.. ఇక మారుతి రేంజ్ రెట్టింపు అయినట్టే. అన్నిటికి మించి మారుతికి సగటు ప్రేక్షకుడికి ఏమి కావాలో బాగా తెలుసు. అందుకే, చేసే ప్రతి సినిమాలో ఒక బోల్డ్ పాయింట్ తీసుకుని.. ఆ పాయింట్ చుట్టూ కథను అల్లుకుని హిట్లు కొడుతూ వస్తున్నాడు.
కానీ మారుతి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తే ఎంతవరకు న్యాయం చేస్తాడు? అనేదే ఎప్పటి నుంచో ఉన్న డౌట్. గతంలో వెంకటేష్ దారుణమైన ప్లాప్ ను ఇచ్చాడు. కాబట్టి మారుతి స్టార్ హీరోలకు పనికిరాడు అనే వాదన కూడా బలంగా ఉంది. మరి ప్రభాస్, మెగాస్టార్ ఏమి చూసి మారుతికి ఛాన్స్ ఇచ్చారో చూడాలి.
Also Read: Sri Reddy – Chiranjeevi Mother: తన తప్పును ఒప్పుకొంది.. మెగాస్టార్ తల్లిగారు క్షమిస్తారా ?