Sreemukhi: దేశంలో ధరలు పెరుగుతూ పోతుంటే శ్రీముఖి బట్టల సైజు తగ్గుతూ పోతుంది. ఓటీటీ యాంకర్ అయ్యాక మరింతగా రెచ్చిపోతుంది. బోల్డ్ హీరోయిన్స్ కూడా సిగ్గుపడేలా శ్రీముఖి స్కిన్ షో ఉంటుంది. చేతినిండా ఈవెంట్స్ తో బిజీగా ఉన్న శ్రీముఖి ఈ రేంజ్ లో అందాల ప్రదర్శన చేయడమేమిటో జనాలకు అర్థం కావడం లేదు. తాజాగా శ్రీముఖి మోకాళ్ళకు జానెడు పైకున్న టాప్ ధరించింది. చాలీ చాలని ఆ పర్పుల్ కలర్ ట్రెండీ వేర్ లో టెంపరేచర్ పెంచేసింది.

ప్యాంట్ వేసుకోడం మర్చిపోయిందా అన్నట్లున్న ఆ డ్రెస్ లో హాట్ యాంగిల్స్ లో ఫోజులిచ్చి టెంప్ట్ చేసింది. శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. ఇక శ్రీముఖి స్కిన్ షో చూసిన నెటిజెన్స్ మెంటలెక్కిపోతున్నారు. పిచ్చి పచ్చి కామెంట్స్ పోస్ట్ చేస్తూ రభస చేస్తున్నారు. శ్రీముఖి బోల్డ్ ఫొటోస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి.
మరోవైపు యాంకరింగ్ లో అనసూయ, రష్మీలను కూడా శ్రీముఖి దాటేసింది. డాన్సింగ్ ఐకాన్ అనే ఓటీటీ షోతో పాటు జాతి రత్నాలు, స్టార్ మా పరివార్, మిస్టర్ అండ్ మిసెస్ వంటి పలు షోస్ కి శ్రీముఖి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. రష్మీ మాదిరి ఒక్క ఛానల్ కి పరిమితం కాకుండా వివిధ ఛానల్స్ లో షోస్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో శ్రీముఖి పాపులారిటీ భారీగా పెరిగిందనేది నిజం.

స్టార్స్ ని ఇంటర్వ్యూ చేసే ఛాన్స్ లు కూడా శ్రీముఖికి దక్కుతున్నాయి. గాడ్ ఫాదర్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవితో పాటు స్పెషల్ ఫ్లైట్ లో శ్రీముఖి ప్రయాణం చేశారు. ఆయన్ని తనదైన శైలిలో ఇంటర్వ్యూ చేశారు . చిరంజీవి-శ్రీముఖి ఇంటర్వ్యూ వైరల్ గా మారింది. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, ప్రమోషన్స్ ద్వారా మరికొంత సంపాదిస్తున్నారు.

శ్రీముఖి సంపాదన స్టార్ హీరోయిన్స్ రేంజ్ కి వెళ్ళిపోయింది. అందుకే ఏమాత్రం విరామం దొరికినా శ్రీముఖి విహారానికి చెక్కేస్తారు. కెరీర్లో శ్రీముఖి చాలా త్వరగా ఎదిగారు. పటాస్ షోతో యాంకర్ గా బుల్లితెరకు పరిచయమైనా శ్రీముఖి దూసుకుపోతున్నారు. టాప్ యాంకర్స్ ని పోటీలో వెనక్కి నెట్టేస్తున్నారు. మరోవైపు నటిగా రాణిస్తున్నారు. పలు చిత్రాల్లో క్రేజీ ఆఫర్స్ పెట్టేస్తున్నారు. అదే సమయంలో హీరోయిన్ గా ప్రయత్నాలు చేస్తున్నారు.