Kalyan Ram Bimbisara Collections: సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏదైనా జరగొచ్చు..నిన్న మొన్నటి వరుకు కనీసం 10 కోట్ల రూపాయిల మార్కెట్ కూడా లేని హీరో కి దశ తిరిగి రాత్రికి రాత్రే స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ని పొందే అవకాశం రావొచ్చు..వంద కోట్ల రూపాయిల మార్కెట్ ఉన్న హీరో 10 కోట్ల రూపాయిల మార్కెట్ కి కూడా పడిపోవచ్చు..నందమూరి కళ్యాణ్ రామ్ విషయం లో మొదటిదే జరిగింది..ఎన్నో ఏళ్ళ నుండి ఇండస్ట్రీ లో ఉంటున్నప్పటికీ కూడా కళ్యాణ్ రామ్ కి ‘భింబిసారా’ వరుకు ఇండస్ట్రీ ని ఊపేసే రేంజ్ హిట్ లేదు.

మధ్యలో ఆయనకీ అతనొక్కడే మరియు పటాస్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు పడినప్పటికీ ఆయన రేంజ్ ని మార్కెట్ ని మరో లెవెల్ కి తీసుకెళ్లే సినిమాలు మాత్రం అవి కావనే చెప్పాలి..కానీ భింబిసారా చిత్రం సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 40 కోట్ల రూపాయలకి పైగా షేర్ ని వసూలు చేసి ప్రభంజనం సృష్టించింది.
ఇక ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుంది అని కళ్యాణ్ రామ్ మరియు ఆ చిత్ర దర్శకుడు వసిష్ఠ భింబిసారా చిత్రం విడుదలైనప్పుడే మీడియాకి అధికారికంగా ప్రకటించారు..ప్రస్తుతం ఈ చిత్రం స్క్రిప్ట్ పనుల్లో బిజీ గా ఉన్నాడు డైరెక్టర్ వసిష్ఠ..ప్రస్తుతం కళ్యాణ్ రామ్ వరుసగా సినిమాలు కమిట్ అవ్వడం వల్లే..షూటింగ్ ఈ ఏడాది ప్రారంభం అవ్వడం కష్టమేనని..వచ్చే ఏడాది జూన్ లేదా జులై నెలలో రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభిస్తామని చెప్పుకొచ్చాడు..ఈ చిత్రం చాలా గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతోందని..కాస్టింగ్ పరంగా కానీ..బడ్జెట్ పరంగా కానీ ఎక్కడా వెనకాడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని..సుమారు వంద కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కుతోందని..వసిష్ఠ ఈ సందర్భంగా తెలిపాడు.

భింబిసారా సినిమాకి ముందు కళ్యాణ్ రామ్ కి కనీసం పది కోట్ల రూపాయిల స్థిరమైన మార్కెట్ కూడా లేదు..ఇప్పుడు ఏకంగా తన సినిమాకి వంద కోట్ల రూపాయిల మార్కెట్ ని సంపాదించుకున్నాడు..ఇది మాములు విషయం కాదు..సీక్వెల్స్ కి ఎలాగో మన టాలీవుడ్ లో అద్భుతమైన క్రేజ్ ఉంది కాబట్టి..భింబిసారా పార్ట్ 2 కి కూడా బాక్స్ ఆఫీస్ మోతమోగిపోయ్యే రేంజ్ లో ఉంటుందని అభిమానులు అంచనా వేస్తున్నారు.