Sreemukhi : పొట్టి బట్టల నుండి ఏకంగా బికినీలకు ప్రమోట్ అవుతున్నారు తెలుగు యాంకర్స్. ఆ మధ్య మ్యారేజ్ యానివర్సరీ జరుపుకునేందుకు భర్తతో వెకేషన్ కి వెళ్లిన అనసూయ బికినీ వేసింది. మొదటిసారి ఆమెను బికినీలో చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇదేం తెగింపు బాబోయ్ అని నోరెళ్ళ బెట్టారు. ఇక రష్మీ గౌతమ్ సైతం ఫ్రెండ్స్ వెకేషన్ లో బికినీ ట్రై చేసింది. ఈసారి శ్రీముఖి వంతు. స్విమ్మింగ్ పూల్ వద్ద సెమీ బికినీలో రచ్చ చేసింది. వీకెండ్ సెలెబ్రేషన్స్ లో భాగంగా స్విమ్మింగ్ చేస్తూ ఎంజాయ్ చేసింది.
శ్రీముఖి ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా సోషల్ మీడియా షేక్ అయ్యింది. కామెంట్స్ బాక్స్ బద్దలైంది. పూర్తి స్థాయి బికినీలో కనిపించి తమను ఎంటర్టైన్ చేయాలని కొందరు కామెంట్స్ పెట్టారు. చెప్పాలంటే కొన్నాళ్లుగా శ్రీముఖి ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ దారుణంగా ఉంటున్నాయి. సెలెబ్రిటీలకు సోషల్ మీడియా ఆదాయమార్గంగా మారింది. ప్రమోషన్స్ ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. వాళ్ళ బ్రాండ్ వాల్యూ ఫాలోవర్స్ ఆధారంగా ఉంటుంది.
ఫాలోవర్స్ సంఖ్య పెరగాలంటే హాట్, బోల్డ్ ఫోటో షూట్స్ తప్పనిసరి. అందుకే శ్రీముఖి లాంటి సెలెబ్స్ ఈ పంథా ఎంచుకున్నారు. అయినా శ్రీముఖి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. స్టార్ యాంకర్ గా ఆమె దూసుకుపోతున్నారు. అరడజను షోల వరకు ఆమె చేతిలో ఉన్నాయి. అనసూయ యాంకరింగ్ మానేయడం, రష్మీ ఈటీవీకే పరిమితం కావడం ఆమెకు కలిసొచ్చింది. సుమ కూడా షోలు తగ్గించేశారు. ఒకటి రెండు మినహాయిస్తే గతంలో మాదిరి ఆమె చేయడం లేదు.
మరోవైపు నటిగా సత్తా చాటుతుంది. తాజాగా బోళా శంకర్ మూవీలో చిరంజీవితో రొమాన్స్ చేసింది. చిరంజీవి-శ్రీముఖి మీద తెరకెక్కిన ఖుషి స్పూఫ్ సీన్ నవ్వులు పూయించింది. భోళా శంకర్ విజయం సాధిస్తే శ్రీముఖి కెరీర్ కి ప్లస్ అయ్యేది. ఇప్పటికే ఒకటి రెండు చిత్రాల్లో శ్రీముఖి హీరోయిన్ గా చేసింది. ఆఫర్స్ వస్తున్నా ఆచితూచి ఎంచుకుంటుంది. కొంచెం పేరున్న దర్శకులతో పని చేయాలని ఆమె కోరుకుంటున్నారట.
ఇక థర్టీ ప్లస్ లో అడుగుపెట్టిన శ్రీముఖి పెళ్లి పై తరచుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ మధ్య హైదరాబాద్ కి చెందిన వ్యాపారవేత్తతో పెళ్లంటూ కథనాలు వెలువడ్డాయి. ఈ పుకార్లను శ్రీముఖి కొట్టేసింది. పెళ్లి కుదిరినప్పుడు చెబుతాను, నిరాధార వార్తలు రాయకండని ఆమె అసహాయం వ్యక్తం చేశారు.