https://oktelugu.com/

Viral Video : పెళ్లి మండపంలో అందరి ముందే కక్కుర్తి పని చేసిన పెళ్లి కొడుకు.. చాచి కొట్టిన వధువు.. వైరల్ వీడియో

వరుడు పెళ్లిలో కూడా తన చెడు అలవాటు మానుకోలేదు. పెళ్లి మండపానికి గుట్కా తింటూ వచ్చాడు. దీంతో వధువు ఆగ్రహించి అందరి ముందు వరుడి చెంప చెల్లుమనిపించింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2023 / 07:46 PM IST

    bride

    Follow us on

    Viral Video : పెళ్లంటే నూరేళ్ల పంట.. కానీ పెళ్లి చేసుకున్నాకే అది నూరేళ్ల మంటలా మారుతుంది. కానీ అది తెలియక చాలా మంది బకరా బాబులు తొందరపడి పెళ్లి చేసుకుంటారు. ఆ సుఖం కోసం కక్కుర్తి పడి జీవితాంతం నరకం అనుభవిస్తుంటారు. పెళ్లిళ్లలో చేసే అల్లర్లు కలకాలం గుర్తుండాలని చాలా మంది పిల్ల చేష్టలు చేస్తుంటారు. అయితే అది అందరికీ సరదాగా అనిపించినా.. కొన్ని కొన్ని సార్లు చిరాకు తెప్పించే ఛాన్స్ కూడా ఉంటుంది.

    తాజాగా ఓ పెళ్లి మండపంలో అందరి ముందే వరుడు చేసిన కక్కుర్తి పని వైరల్ అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తంది. వధువు రియాక్షన్ చూసి అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. పెళ్లి కూతురు వరుడికి అందరి ముందే తగిన గుణపాఠం నేర్పింది.

    వరుడు పెళ్లిలో కూడా తన చెడు అలవాటు మానుకోలేదు. పెళ్లి మండపానికి గుట్కా తింటూ వచ్చాడు. దీంతో వధువు ఆగ్రహించి అందరి ముందు వరుడి చెంప చెల్లుమనిపించింది.

    పెళ్లిమండపంలో పూజారి ఏదో తీర్థం తాగాలని పెళ్లి కొడుకును కోరుతాడు. పెళ్లి కొడుకు నోట్లో గుట్కా వేసుకోవడంతో తాగడు. దీంతో పూజారి సర్దుకుపోతాడు. కానీ వధువు మాత్రం ఈ విషయాన్ని వదలదు. పూజ ఇలాగేనా చేయించేది అని పూజారి వీపుపై ఒక్కటిస్తుంది..

    ఇక పెళ్లిలో గుట్కా వేసుకుంటావా? తీర్థం తాగవా? అంటూ వరుడి చెంప చెళ్లుమనిపిస్తుంది. ఆ గుట్కా ఉమ్మివేయడానికి వెనక్కి వరుడు వెళ్లగా అక్కడ మహిళలు ఉంటారు. అతి కష్టం మీద ఉంచేసి కూర్చుంటాడు.

    పెళ్లికూతురు ఇంకా పెళ్లికాకముందే ఈ స్థాయిలో అందరినీ కొట్టి వరుడిని భయపెడుతుంటే ఇక పెళ్లి అయితే పరిస్థితి ఏంటో అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.