Sreeleela Viral Vayyari Song: ప్రముఖ రాజకీయ నాయకుడు గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి సినిమా రంగంలోకి ఎంట్రీ ఇవ్వడానికి ఇంకా కాస్త సమయం మాత్రమే ఉంది. ఎందుకంటే ఈయన నటించిన ‘జూనియర్’ సినిమా విడుదలకు ముస్తాబవుతోంది. ఒకేసారి ఈ ఒక్క సినిమాతో తెలుగు, తమిళ, కన్నడ ఇండస్ట్రీని పలకరించనున్నాడు. ఈయన మొదటి సినిమా ఇదే. అయినా సరే ఈ జూనియర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి ప్రధాన కారణం ఈ మూవీ క్యాస్టింగ్ అంటున్నారు విశ్లేషకులు. ఇక ఇందులోని ఒక సాంగ్ విడుదల అవడంతో ట్రోల్ కు గురి అవుతున్నారు కిరీటి.
అయితే ఈ సినిమాలో అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఇక ఈ హీరోకు శ్రీలీల జతకడుతుంది. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్ కు సినీ అభిమానుల నుంచి మంచి పాజిటివ్ టాక్ రావడంతో హిట్ పక్కా అని ఎదురుచూస్తున్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాలో నుంచి లేటెస్ట్ గా రెండో పాట కూడా విడుదలైంది. అదే ‘వైరల్ వయ్యారి నేనే.. వయసొచ్చిన అణుబాంబును ’ సాంగ్. ఈ సాంగ్ విన్నారా? అయితే ఈ సాంగ్ ను ‘ఆదిత్య మ్యూజిక్’ విడుదల చేసింది. యూట్యూబ్ ను షేక్ చేస్తున్న సాంగ్ గా నిలిచింది.
ఇక ఇందులోని డ్యాన్స్ చూసి చాలా ట్రోల్ చేస్తున్నారు కొందరు. దీనికి సంబంధించిన మేకింగ్ వీడియో రీసెంట్ గా బయటకు వచ్చింది. ఆ వీడియోను చూసిన చాలా మంది వామ్మో శ్రీలీల నడుమును భలే నలిపేస్తున్నావు అంటూ ట్రోల్ చేస్తున్నారు. వై..వై..వై.. వై వైరల్ వయ్యారి అంటూ వచ్చే లిరిక్ లో కిరీటి శ్రీ లీల నడుమును పట్టుకునే సీన్ ఉంటుంది. ఈ సీన్ ను చూసి అదృష్టం అంటే నీదే బ్రో.. ఏం అదృష్టం అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు. ఓ సారి మీరు కూడా ఓ లుక్ వేసేయండి మరి.
Also Read: దేవి’ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా..? పాపం ప్రస్తుతం ఇతని పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆపుకోలేరు!
ఇక ఈ సాంగ్ లో శ్రీలీల ఎనర్జిటిక్ స్టెప్పులకు మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి అనడంలో సందేహం లేదు. శ్రీలల అంతా కాకపోయినా కిరిటీ రెడ్డి కూడా బాగానే డ్యాన్స్ చేస్తున్నారు అంటున్నారు కొందరు. ప్రస్తుతం వైరల్ వయ్యారి పాట అన్ని భాషలలో కలిపి 6 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో ఊహించుకోండి.
ఈ పాటకు పవన్ భట్ సాహిత్యం రాస్తే హరిప్రియ, దీపక్ బ్లూ స్వరాలు సమకూర్చారు. ది గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ ‘జూనియర్’ సినిమా జూలై 18న కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో విడుదల అవడానికి సిద్ధం అయింది. ఈ సినిమాలో కిరీటి, శ్రీలీలతో పాటు రవిచంద్రన్, జెనీలియా డిసౌజా లు కూడా కనిపించనున్నారు.