Child Artist Devi : బాలనటులుగా నటించిన ఎంతో మంది నేడు పెద్దవాళ్ళకి స్టార్ హీరోలు గా, హీరోయిన్లు గా ఆయా ఇండస్ట్రీలలో రాణిస్తుండడం మనమంతా చూస్తూనే ఉన్నాం. అయితే కొంతమంది అలనాటి బాలనటులు అద్భుతమైన టాలెంట్ ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు. సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఏళ్ళు గడిచిపోతున్నాయి, కానీ వాళ్లకు మాత్రం అవకాశాలు రావడం లేదు. అలాంటి వారిలో ఒకరు మహేంద్రన్(Mahendran). ఇతని పేరు చెప్తే మీకు గుర్తుకురాకపోవచ్చు. కానీ ‘దేవి’ చిత్రం లో బాలనటుడు అంటే మాత్రం కళ్ళు మూసుకొని గుర్తు పట్టేయగలరు. ఎందుకంటే ఆ చిత్రం లో ఆయన అంతటి అద్భుతమైన నటన కనబర్చాడు కాబట్టి. ఇతని అభినయాన్ని చూసి అప్పట్లో థియేటర్స్ లో ఆడియన్స్ వణికిపోయారు అంటే అతి సయోక్తి కాదేమో. ఈ చిత్రానికి ముందు , ఆ తర్వాత మహేంద్రన్ తెలుగు, తమిళ భాషలు కలిపి 130 కి పైగా సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
Also Read : విశ్వంభర’ విడుదలకు లైన్ క్లియర్..పవన్ కళ్యాణ్ అభిమానులకు ఇక నిరాశే!
మన తెలుగు ఆడియన్స్ కి ఇతగాడు ఆహా అనే మూవీ తో పరిచయం అయ్యాడు. పెద్దయ్యాక ఈ కుర్రాడు కచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ కనీస స్థాయి గుర్తింపు కూడా లభించలేదు. హీరో గా పలు సినిమాల్లో నటించాడు కానీ, అవి ఎప్పుడొచ్చాయో, ఎప్పుడు వెళ్ళాయో కూడా ఆడియన్స్ కి తెలియని పరిస్థితి, అయితే పెద్దయ్యాక ఇతను చేసిన చిత్రాల్లో కాస్తో కూస్తో మంచి గుర్తింపు తెచ్చి పెట్టిన చిత్రం ‘మాస్టర్’. విజయ్(Thalapathy Vijay) హీరో గా నటించిన ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇందులో విజయ్ సేతుపతి చిన్నప్పటి క్యారక్టర్ లో నటించాడు మహేంద్రన్. కనిపించింది కాసేపే అయినా తన నటన తో అందరినీ డామినేట్ చేసేసాడు. కుర్రాడిలో ఇంత టాలెంట్ ఉంది, ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ఈ సినిమా చూసినప్పుడు అందరికీ అనిపించింది.
Also Read: మన టాలీవుడ్ హీరోలు బక్కచిక్కిపోతే ఎలా ఉంటారో తెలుసా? షాకింగ్ వీడియో
ఇది కాసేపు పక్కన పెడితే రీసెంట్ గా మహేంద్రన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన కొన్ని మాటలు సంచలనంగా మారాయి. ఆయన మాట్లాడుతూ ‘చిన్నతనం లో నేను ఎవ్వరూ చూదంతా పీక్ స్థాయిని చూసాను. ఒక్క రోజులో నాలుగు సినిమాల షూటింగ్స్ లో పాల్గొన్న రోజులు ఉన్నాయి. ఉదయం తమిళనాడులో షూటింగ్ ఉంటే, మధ్యాహ్నం పొలాచ్చిలో, సాయంత్రం హైదరాబాద్ లో షూటింగ్స్ ఉండేవి. అందుకోసం రోజుకి మూడు విమానాల్లో ప్రయాణించేవాడిని. నాకోసం స్టార్ హీరోలు ఎదురు చూసేవారు. కేవలం నా డేట్స్ కోసమే రాత్రి సమయాల్లో షూటింగ్స్ పెట్టేవారు. అలాంటి బిజీ లైఫ్ ని ఎంజాయ్ చేసిన నాకు మధ్యలో అవకాశాలు రాలేదు. ఏ దర్శక నిర్మాత నన్ను పట్టించుకోలేదు. హీరో గా పనికిరావని అన్నారు . కనీసం క్యారెక్టర్స్ కూడా ఇవ్వలేదు. అలాంటి స్థాయి నుండి ఇప్పుడిప్పుడే మళ్ళీ అవకాశాలను వరుసగా అందుకుంటున్నాను’ అంటూ మహేంద్రన్ చెప్పుకొచ్చాడు.