Sreeleela: టాలీవుడ్ శ్రీలీల జపం చేస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ భామకు ఉన్నన్ని సినిమా ఆఫర్స్ మరో హీరోయిన్ కి లేవనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు దాదాపు 10 సినిమాలు చేతిలో ఉంచుకొని రోజుకు మూడు షిఫ్ట్స్ వర్క్ చేస్తున్న శ్రీలీల అటు టాలీవుడ్ యంగ్ హీరోల సినిమాల్లోనూ అలాగే టాప్ పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తుంది. యాక్టింగ్, డాన్స్ లలోను తనదైన దూకుడు చూపిస్తూ టాప్ గేర్ లో దూసుకెళ్తుంది ఈ 22 ఏళ్ల చిన్నది.
డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని సినిమాలు వదులుకున్న శ్రీలీల ఒక పాన్ ఇండియా ఆఫర్ పక్కన పెట్టినట్లు సమాచారం. అల్లు అర్జున్, సుకుమార్ కలయికలో వచ్చిన పుష్ప ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుందో అందరికీ తెలుసు, త్వరలో రాబోతున్న పుష్ప 2 మీద భారీ అంచనాలే ఉన్నాయి. సుక్కు, బన్నీ సినిమా అంటే ఐటెం సాంగ్ కచ్చితంగా ఉంటుంది. పుష్ప లో ఊ అంటావా అనే సాంగ్ ఎంత హిట్ అయిందో తెలిసిందే. సమంత నటించిన ఈ పాట ఇండియా వైడ్ ఊపేసింది.
ఇక పుష్ప 2 లో కూడా ఇలాంటి మరో ఐటెం సాంగ్ ను సెట్ చేశారు. ఇందులో నటించడం కోసం సుకుమార్ టీం శ్రీలీల ను అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది. డాన్స్ లో మంచి పట్టున్న శ్రీలీల అయితే బన్నీ సరసన సరిపోతుందని భావించి పుష్ప 2 యూనిట్ ఆమెను కలిసింది. నిర్మొహమాటంగా తాను ఈ ఐటెం సాంగ్ చేయనని చెప్పినట్లు తెలుస్తుంది. మొత్తం సినిమాకు ఇచ్చే రెమ్యూనరేషన్ ఒక్క పాటకే ఇస్తామని చెప్పిన శ్రీలీల ఒప్పుకోలేదని టాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
పరిశ్రమలో ఒక సెంటిమెంట్ ఉంది. హీరోయిన్ అవకాశాలు రానప్పుడు ఐటెం సాంగ్స్ చేస్తారనే టాక్ ఉంటుంది. బహుశా దానికి భయపడి శ్రీలీల ఒప్పుకోలేదేమో. ప్రస్తుతం చేతిలో పది సినిమాలు ఉంచుకున్న శ్రీలీల ఈ ఐటెం సాంగ్ ఆఫర్ రిజెక్ట్ చేయటంలో పెద్ద వింతేమీ లేదని అనుకోవచ్చు. కానీ పుష్ప 2 లాంటి సినిమాలో నటిస్తే పాన్ ఇండియా స్థాయిలో పేరు కూడా వస్తుందని అనవసరంగా మంచి అవకాశాన్ని వదులుకుందని టాలీవుడ్ లో మరో వర్గం అభిప్రాయపడుతోంది.