Sreeleela: శ్రీలీల టాలీవుడ్ సెన్సేషన్ గా అవతరించింది. ఆమెకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ పడ్డాయి. పెళ్ళిసందD చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన శ్రీలీల మొదటి చిత్రంతోనే ఆకట్టుకుంది. ఆ చిత్ర ఫలితంతో సంబంధం లేకుండా శ్రీలీలకు ఆఫర్స్ క్యూ కట్టాయి. రవితేజకు జంటగా నటించిన ధమాకా సూపర్ హిట్ కొట్టింది. ఆ మూవీలో శ్రీలీల డాన్సు, యాక్టింగ్ లో ఎనర్జీ చూసి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తాజాగా భగవంత్ కేసరి సక్సెస్ ఎంజాయ్ చేస్తుంది శ్రీలీల. బాలకృష్ణ హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన భగవంత్ కేసరి హిట్ స్టేటస్ అందుకుంది.
దసరా కానుకగా విడుదలైన భగవంత్ కేసరి మూవీలో బాలయ్యకు కూతురు వరుస పాత్ర చేసింది శ్రీలీల. కథలో కీలకమైన రోల్ లో ఆకట్టుకుంది. గ్లామర్ ఇమేజ్ కి భిన్నమైన పాత్రలో మెప్పించింది. బాలకృష్ణ, శ్రీలీల కాంబో అదిరింది. నెక్స్ట్ శ్రీలీల నుండి రానున్నవన్నీ కమర్షియల్ చిత్రాలే. సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న గుంటూరు కారం మూవీలో మెయిన్ లీడ్ చేస్తుంది.
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గుంటూరు కారం చిత్రీకరణ దశలో ఉంది. 2024 జనవరి 12న విడుదలవుతుంది. శ్రీలీల చేతిలో ఉన్న మరో భారీ ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ పొలిటికల్ షెడ్యూల్స్ కారణంగా ఈ మూవీ చిత్రీకరణ సవ్యంగా సాగడం లేదు.
నెక్స్ట్ ఆదికేశవ చిత్రంలో శ్రీలీల అలరించనుంది. వైష్ణవ్ తేజ్ హీరోగా ఆదికేశవ తెరకెక్కుతుంది. నితిన్ కి జంటగా ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రం చేస్తుంది. చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్న శ్రీలీల మరోవైపు చదువు పూర్తి చేస్తుంది. ఆమె ఎం బి బి ఎస్ చదువుతుంది. సోషల్ మీడియా వేదికగా గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తుంది. తాజాగా చీర కట్టులో నడుము వంపులు చూపిస్తూ కాకరేపింది. శ్రీలీల గ్లామరస్ లుక్ వైరల్ గా మారింది.
View this post on Instagram