Geethu Royal: బిగ్ బాస్ సీజన్ 6తో వెలుగులోకి వచ్చిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గీతూ రాయల్. ఆమె బిగ్ బాస్ రివ్యూవర్ కూడాను. ఆ సీజన్ లో బిగ్ బాస్ రివ్యూవర్ ఆది రెడ్డి సైతం కంటెస్ట్ చేశాడు. తెలివిగా గేమ్ ఆడిన ఆదిరెడ్డి ఫైనల్ కి వెళ్ళాడు. అతి చేసిన గీతూ రాయల్ 9 వారాలకే మూటాముల్లె సర్దుకోవాల్సి వచ్చింది. గీతూ రాయల్ హౌస్లో అతి చేసేది. ప్రారంభంలో బిగ్ బాస్ ఆమెకు ప్రాధాన్యత ఇచ్చాడు. గీతూ కేంద్రంగా గేమ్ నడిపేవాడు. హోస్ట్ నాగార్జున కూడా ఆమెను పొగడ్తలతో ఆకాశానికి ఎత్తడంతో, తన గురించి తాను ఏవేవో ఊహించుకుంది. ఒక దశకు వచ్చాక బిగ్ బాస్ మాట వినకపోవడం, కొత్తగా రూల్స్ పెట్టడం చేసింది.
Also Read: కొత్త జంట చైతు-శోభిత సాహసాలు… రేస్ ట్రాక్ మీద దూసుకెళ్లిన స్టార్ కపుల్!
నాగార్జున హెచ్చరించినా గీతూ రాయల్ లో మార్పు రాలేదు. దాంతో 9వ వారం ప్రేక్షకులు ఎలిమినేట్ చేశారు. టైటిల్ నాదే అనే భ్రమలో ఉన్న గీతూ రాయల్ మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్లో గుక్క పెట్టి ఏడ్చింది. చివరికి వేదిక మీద కూడా నాకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని హోస్ట్ నాగార్జునను వేడుకుంది. రూల్ ఈజ్ రూల్ ఫర్ ఆల్ అని, నాగార్జున అక్కడున్న అమ్మాయిలతో బయటకు పంపించేశాడు. బయటకు వచ్చాక కూడా రెండు రోజులు ఏడుస్తూనే ఉన్నానని గీతూ రాయల్ వీడియోలు చేసింది. పీఆర్ లను పెట్టుకోకపోవడం, నమ్మిన వాళ్ళు సపోర్ట్ చేయకపోవడం వలనే ఎలిమినేట్ అయ్యానని గీతూ బాధపడింది.
బిగ్ బాస్ సీజన్ 7కి గీతూ రాయల్ బజ్ హోస్ట్ గా వ్యవహరించింది. ఎలిమినేటైన కంటెస్టెంట్స్ ని తనదైన ప్రశ్నలతో విషయం లాగే ప్రయత్నం చేసింది. ఆ సీజన్ కి పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ అయ్యాడు. ఫినాలే ఎపిసోడ్ ముగించుకుని వెళుతున్న గీతూ రాయల్ మీద దాడి జరిగింది. ఆమె కారు అద్దాలు పగలగొట్టారు. కారులోనుండి బయటకు లాగే ప్రయత్నం చేశారు. వాళ్లపై గీతూ రాయల్ కేసు పెట్టింది. తనతో కఠువుగా ప్రవర్తించిన ఒకడి అడ్రెస్ చెప్పినోడికి పదివేలు ఇస్తానని కూడా ప్రకటన చేసింది.
ప్రస్తుతం యూట్యూబ్ వీడియోలతో నెట్టుకొస్తున్న గీతూ రాయల్ తాజాగా మహానటి సావిత్రి మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమలో ఉన్న లేదా పెళ్లి చేసుకున్న వారి జోలికి వెళ్ళకూడదు. మహానటి సినిమా చూశాక నాకు అర్థమైంది అదే. పెళ్ళై పిల్లలు ఉన్న జెమినీ గణేశన్ ని పెళ్లి చేసుకోవడం సావిత్రి చేసిన అతిపెద్ద తప్పు. తాను భార్య ఉన్న ఒక వ్యక్తికి దగ్గర కావచ్చు.. తన భర్త వేరొకరితో ఉండకూడదా? కర్మ భూమరాంగ్ అవుతుంది. ఆమె ఏదైతే చేసిందో ఆమెకు అదే జరిగింది, అన్నారు గీతూ రాయల్ కామెంట్స్ పై సావిత్రి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.