Sreeleela Tilak Varma Relationship: ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నటి శ్రీలీల. ఈమె ఇండస్ట్రీ లోకి వచ్చిన తర్వాత అప్పటి వరకు టాప్ హీరోయిన్స్ గా చలామణి అయిన వాళ్ళందరూ కనుమరుగు అయిపోయారు. ఇప్పుడు ఆమెకు కెరీర్ నిండా డిజాస్టర్ ఫ్లాప్స్ ఉన్నాయి , అయినప్పటికీ కూడా నిర్మాతలు ఈమెతో సినిమాలు చేయడానికి క్యూలు కడుతున్నారంటే , యూత్ లో ఆమెకు ఉన్నటువంటి క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినీ గ్లామర్ ప్రపంచం లో హీరోయిన్స్ పై రూమర్స్ ఉండడం సర్వ సాధారణం. కానీ శ్రీలీల అందుకు అతీతం , ఈమెపై ఎలాంటి రూమర్స్ లేవని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఈమె మీద కూడా రూమర్స్ మొదలయ్యాయి. బాలీవుడ్ లో శ్రీలీల కి సంబంధించిన ఒక రూమర్ ఇప్పుడు ఇండస్ట్రీ ని షేక్ చేస్తోంది.
ప్రముఖ క్రికెటర్ తిలక్ వర్మ తో శ్రీలీల ప్రేమలో ఉందని, వీళ్లిద్దరు ప్రస్తుతం డేటింగ్ చేస్తున్నారని అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా ఈమె ధర్మశాల లో జరిగిన పంజాబ్ కింగ్స్ వెర్సస్ ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్ లో ఆడియన్స్ గ్యాలరీ లో కూర్చొని ఎంజాయ్ చేసింది. ఈమెతో పాటు, తల్లి స్వర్ణలత కూడా ఉండడం విశేషం. వీళ్లిద్దరు తిలక్ వర్మ తో అత్యంత సన్నిహితంగా ఉండడం, అంతే కాకుండా రెండు మూడు సార్లు ముంబై లో తిలక్ వర్మ తో కలిసి శ్రీలీల కనిపించడం వంటివి వీళ్లిద్దరు ప్రేమలో ఉన్నారు అనే రూమర్ కి బలాన్ని చేకూరుస్తోంది. గతం లో సూర్య కుమార్ యాదవ్ కూడా తిలక్ వర్మ ప్రేమలో ఉన్నాడు అంటూ తీజ్ చేసిన వీడియో కి లింక్ చేసి చూస్తూ , వీళ్లిద్దరు కచ్చితంగా ప్రేమలోనే ఉన్నారు అని తేల్చి చెప్పేస్తున్నారు నెటిజెన్స్.
అయితే శ్రీలీల సన్నిహిత వర్గాలు మాత్రం , తిలక్ వర్మ కుటుంబం తో శ్రీలీల కుటుంబానికి ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉందని , ఆ కారణం చేతనే తిలక్ వర్మ మ్యాచ్ లకు శ్రీలీల వస్తుందని అంటున్నారు. ఇందులో ఎంత మాత్రం నిజముందో చూడాలి . ఇక శ్రీలీల కెరీర్ విషయానికి వస్తే, తెలుగు లో ప్రస్తుతం ఈమె ఎలాంటి సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈమె హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కమర్షియల్ గా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. అదే విధంగా ఈమె కోలీవుడ్ లో రెండు కొత్త సినిమాల్లో నటించడానికి రీసెంట్ గానే సంతకాలు చేసింది , అదే విధంగా బాలీవుడ్ లో ఈమె హీరోయిన్ గా నటించిన రెండు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.