Homeఎంటర్టైన్మెంట్Sreeleela: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో 'ఉస్తాద్ భగత్ సింగ్' పాటకు చిందులేసిన శ్రీలీల..వీడియో వైరల్!

Sreeleela: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ పాటకు చిందులేసిన శ్రీలీల..వీడియో వైరల్!

Sreeleela: చేసిన ప్రతీ సినిమా డిజాస్టర్ అవుతున్నప్పటికీ, అవకాశాల మీద అవకాశాలు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న ఏకైక సౌత్ ఇండియన్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela). ‘పెళ్లి సందడి’ చిత్రంతో ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఆమె, ఆ తర్వాత ‘ధమాకా’ చిత్రం తో భారీ సక్సెస్ ని అందుకుంది. దీంతో ఈమెకు ఇండస్ట్రీ లో డిమాండ్ మామూలుగా ఏర్పడలేదు. వరుసగా ఆఫర్స్ క్యూలు కట్టాయి. కానీ ‘ధమాకా’ తర్వాత ‘భగవంత్ కేసరి’ మినహా శ్రీలీల నటించిన ప్రతీ సినిమా డిజాస్టర్ ఫ్లాప్ అవుతూ వచ్చింది. తెలుగు లో ఈమధ్య కాలం లో అవకాశాలు తగ్గాయి కానీ, హిందీ, తమిళ భాషల్లో వరుసగా సినిమాలను ఒప్పుకుంటూ ముందుకెళ్తోంది శ్రీలీల. రీసెంట్ గానే ఆమె హీరోయిన్ గా నటించిన ‘పరాశక్తి’ అనే చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది.

ఇప్పుడు ఆమె హీరోయిన్ గా నటించిన సినిమాల్లో విడుదలకు దగ్గరగా ఉన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh). పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) హీరో గా నటించిన ఈ సినిమా ఫలితం మీదనే శ్రీలీల టాలీవుడ్ కెరీర్ ఆధారపడింది. మార్చి 26న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ రేంజ్ లో విడుదల కానుంది. గతంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ముందు శృతి హాసన్ హీరోయిన్ గా చేసిన ప్రతీ చిత్రం డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఐరన్ లెగ్ అనే పేరుని తెచ్చుకుంది. ఇక ఆమె కెరీర్ ముగిసిపోయింది అని అనుకుంటున్న సమయం లో ‘గబ్బర్ సింగ్ ‘ చిత్రం విడుదలై భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

ఇప్పుడు పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం కూడా శ్రీలీల కి అలాంటి బ్రేక్ ఇస్తుందని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇకపోతే శ్రీలీల నిన్న ఒక షాపింగ్ మాల్ ఓపెనింగ్ కి వెళ్ళింది. అక్కడ అభిమానులు ఆమెని ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లోని ‘దేఖ్ లేంగే సాలా’ పాటకు డ్యాన్స్ వెయ్యమని రిక్వెస్ట్ చేశారు. అభిమానులు అడిగిన వెంటనే పాట వెయ్యమని శ్రీలీల అడగడం, ఆ పాటకు ఆమె డ్యాన్స్ చేయడం హైలైట్ గా నిల్చింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఆ వీడియో ని మీరు కూడా చూసేయండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version