Sreeleela Dance Viral: ఈ ఏడాది అత్యధిక శాతం పెద్ద సినిమాలకంటే చిన్న సినిమాలే ట్రేడ్ ని షాక్ కి గురి చేశాయి. ఎలాంటి అంచనాలు లేకుండా చాలా సైలెంట్ గా విడుదలైన చిన్న సినిమాలు సూపర్ హిట్స్ గా నిల్చి మంచి వసూళ్లు రాబడుతున్నాయి. కేవలం మన టాలీవుడ్ లో మాత్రమే కాదు, ప్రతీ ఇండస్ట్రీ లోనూ ఇదే పరిస్థితి. అలా ఆడియన్స్ ని సర్ప్రైజ్ కి గురి చేస్తూ సైలెంట్ హిట్ గా నిల్చిన మరో చిత్రం ‘జూనియర్'(Junior Movie). గాలి జనార్దన్ రెడ్డి(Gali Janardhan Reddy) కుమారుడు, గాలి కిరీటి రెడ్డి(Kireeti Reddy) హీరో గా నటించిన ఈ చిత్రం లో శ్రీలీల(Sreeleela) హీరోయిన్ గా నటించగా, జెనీలియా(Genelia Deshmukh) కీలక పాత్ర పోషించింది. విడుదలకు ముందు ఈ సినిమా యూనిట్ మొత్తం ప్రొమోషన్స్ అదరగొట్టేసింది. దానికి తోడు ఈ చిత్రం నుండి విడుదలైన ‘వైరల్ వయ్యారి’ పాట పెద్ద హిట్ అయ్యింది.
Also Read: ‘హరి హర వీరమల్లు’ ప్రీమియర్ షోస్ టికెట్స్ కి ఫుల్ డిమాండ్.. డేంజర్ లో ‘పుష్ప 2’ రికార్డు!
విడుదల అయ్యాక కూడా హీరో కిరీటి రెడ్డి ఈ పాటలో వేసిన స్టెప్పులకు మంచి రెస్పాన్స్ వచ్చింది. టాలీవుడ్ కి మరో టాలెంటెడ్ డ్యాన్సర్ దొరికేశాడని కిరీటి డ్యాన్స్ స్టెప్పులు చూసిన ప్రతీ ఒక్కరు కామెంట్ చేస్తున్నారు. అయితే ఓపెనింగ్ వసూళ్లు కూడా ఎవ్వరూ ఊహించని రేంజ్ లోనే వచ్చాయి. మొదటి రోజు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో 34 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. కుబేర తర్వాత సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న సినీ పరిశ్రమ కి కాస్త ఉపశమనం కలిగించింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రెండు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు, కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయట. షాకింగ్ కి గురి చేసే మరో విషయం ఏమిటంటే, ఈ చిత్రానికి రెండవ రోజు బుక్ మై షో యాప్ లో 42 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి.
Also Read: హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో క్రిష్ ఎక్కడ..? ఇంత అన్యాయమా?
అంటే మొదటి రోజు కంటే ఎక్కువ అన్నమాట. రెండవ రోజు కేవలం తెలుగు రాష్ట్రాల నుండే కోటి 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే రెండు కోట్ల 25 లక్షలు. అలా రెండు రోజుల్లో 4 కోట్ల 25 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి ట్రేడ్ కూల్ సర్ప్రైజ్ ని అందించింది ఈ చిత్రం. ఈరోజు ఆదివారం కాబట్టి, అన్ని ప్రాంతాల్లో నేడు కూడా మంచి వసూళ్లు నమోదు అవుతాయి. నేటితో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుకి అతి దగ్గరగా వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఎంత బాగా ఆడినా ఈ వారం రోజులే ఆడాలి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ చిత్రం వస్తుంది కాబట్టి, ఆ సినిమానే అన్ని థియేటర్స్ లో ఉంటుంది. మరి ఈ వారం రోజుల్లో ఎంత రీకవర్ చేస్తుందో చూడాలి.