Director Krish Controversy: టాలీవుడ్ లో అత్యంత ఆలస్యంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని విడుదల అవ్వబోతున్న చిత్రం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) అంజి చిత్రం షూటింగ్ మొదలైన మూడేళ్ళ తర్వాత విడుదలైంది. కానీ ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఆ రికార్డు ని డబుల్ మార్జిన్ తో క్రాస్ చేసింది. షూటింగ్ మొదలైన ఆరేళ్లకు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా పై మొదటి నుండి అంచనాలు భారీగానే ఉండేవి. కానీ ఎప్పుడైతే షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తూ, మధ్యలో ఓజీ లాంటి క్రేజీ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కిందో ఈ చిత్రాన్ని అభిమానులంతా మర్చిపోయారు. అభిమానులు పట్టించుకున్నా, పట్టించుకోకపోయినా నిర్మాత AM రత్నం మాత్రం పట్టువదలని విక్రమార్కుడులాగా మొండిగా నిలబడి ఈ చిత్రాన్ని పూర్తి చేసి ఈ నెల 24 న మన ముందుకు తీసుకొని రాబోతున్నాడు.
Also Read: పెద్ది సినిమా సెట్ కోసం అన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారా..?
ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు క్రిష్(Krish Jagarlamudi) మొదట్లో తెరకెక్కించాడు. ఆ తర్వాత షూటింగ్ ఆలస్యం అవుతూ రావడంతో ఆయన ఈ చిత్రం నుండి తప్పుకున్నాడు. అయితే 70 శాతం కి పైగా షూటింగ్ క్రిష్ నే పూర్తి చేసాడు. మొన్న విడుదలైన థియేట్రికల్ ట్రైలర్ లో అత్యధిక శాతం షాట్స్ మొత్తం ఆయన దర్శకత్వం లో తెరకెక్కినవే. కానీ ట్రైలర్ లో క్రిష్ పేరు ని తొలగించేసి కేవలం జ్యోతి కృష్ణ పేరు ని మాత్రమే వేసుకున్నారు. ఇకపోతే నిన్ననే ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేశారు. ఈ మేకింగ్ వీడియో లో జ్యోతి కృష్ణ మేకింగ్ మాత్రమే ఉంది కానీ, డైరెక్టర్ క్రిష్ మేకింగ్ ఎక్కడా లేదు. దీనిపై అభిమానులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. సినిమా గ్రాండియర్ ని కానీ, లేదా డైరెక్టర్ క్రిష్ మేకింగ్ ని కానీ ఇందులో చూపించలేదు.
Also Read: ఫిష్ వెంకట్ ఒక్కో సినిమాకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకునేవాడో తెలుసా?
కేవలం జ్యోతి కృష్ణ తనని తానూ ప్రమోట్ చేసుకోవడం కోసమే ఈ మేకింగ్ వీడియో ని వదిలినట్టు ఉంది. ఈ మేకింగ్ వీడియో లో కుస్తీ ఫైట్ మేDirector Krish Controversy: హరి హర వీరమల్లు’ మేకింగ్ వీడియో క్రిష్ ఎక్కడ..? ఇంత అన్యాయమా?కింగ్ ని కూడా చూపించారు. అందులో డైరెక్టర్ క్రిష్ కనపడాలి కదా, కానీ కనపడలేదు. వాస్తవానికి ఈ మేకింగ్ వీడియో ని జులై 18 న విడుదల చెయ్యాలని అనుకున్నారు. కానీ డైరెక్టర్ క్రిష్ షాట్స్ ఆ మేకింగ్ వీడియో లో ఉండడం తో, జ్యోతి కృష్ణ ఆరోజు విడుదల ని ఆపించి, క్రిష్ ని ఆ మేకింగ్ వీడియో లో తొలగించి, కేవలం తన మేకింగ్ ఉన్న షాట్స్ తో కూడిన వీడియో ని విడుదల చేయించాడని ఒక రూమర్ ఉంది. సగానికి పైగా సినిమాని తీసినోడిని ఇలా తొక్కేస్తారా?, ఇంత అన్యాయం ఏమిటి? అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
