Sreeleela as Chiranjeevi daughter: ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) చిత్రం తో ఈ సంక్రాంతి బరిలో దిగి , భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), తన తదుపరి చిత్రాన్ని బాబీ తో చేయబోతున్నాడు. మూడేళ్ళ క్రితం బాబీ మెగాస్టార్ తో చేసిన ‘వాల్తేరు వీరయ్య’ చిత్రం కమర్షియల్ గా ఎంతటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. దాదాపుగా 140 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. రీ ఎంట్రీ తర్వాత చిరంజీవి లోని కామెడీ టైమింగ్ ని కాస్త బయటకు తీసుకొచ్చిన సినిమా ఇదే. ఇప్పుడు ‘మన శంకర వరప్రసాద్ గారు’ తో కామెడీ టైమింగ్ పూర్తి స్థాయిలో బయటపడింది. అయితే ఈసారి డైరెక్టర్ బాబీ మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ మాస్ యాంగిల్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం లో ఉన్నట్టు తెలుస్తోంది.
ఇందులో చిరంజీవి గ్యాంగ్ స్టర్ రోల్ లో కనిపిస్తాడట. సినిమా మొత్తం మంచి ఇంటెన్సిటీ తో దూసుకెళ్తుంది, యాక్షన్ డ్రామా మీదనే ఈసారి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారని అంటున్నారు. ఇందులో మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్ర పోషించబోతున్నాడట. ఈ నెల 25 నుండి ఈ మూవీ షూటింగ్ మొదలు కాబోతుంది. ఇకపోతే ఈ సినిమాలో చిరంజీవి కి కూతురు క్యారెక్టర్ లో ప్రముఖ యంగ్ హీరోయిన్ శ్రీలీల లాక్ అయ్యినట్టు తెలుస్తోంది. ఒక స్టార్ హీరోయిన్ మెగాస్టార్ కి కూతురు గా నటించడం అంటే, చిరంజీవి ఇందులో ‘జైలర్’ లో రజినీకాంత్ తరహా పాత్ర పోషిస్తున్నది తెలుస్తోంది. గతం లో శ్రీలీల నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రం లో కూతురి క్యారెక్టర్ చేసింది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కి కూడా ఆమె కూతురు గానే నటించబోతుండడం గమనార్హం. ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య ఉన్న ఎమోషనే కీలకం అట.
70 ఏళ్ళ వయస్సులో చిరంజీవి ని ఆయన అభిమానులు, ఆడియన్స్ ఎలా చూడాలని అనుకుంటున్నారో, అలా చూపించే ప్రయత్నం చేస్తున్నాడట డైరెక్టర్ బాబీ. ఇకపోతే ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం బాలీవుడ్ బ్యూటీ, విశ్వసుందరి ఐశ్వర్య రాయి ని సంప్రదించారట. ఆమె వైపు నుండి ఇంకా గ్రీన్ సిగ్నల్ రావాల్సి ఉంది. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసి, వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. ఇక ఈ సినిమా పూర్తి అవ్వగానే , మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిరంజీవి, శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ మొదలు కానుంది. ఈ చిత్రానికి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు.
