Shruti Haasan: కమల్ హాసన్(Kamal Hassan) కూతురిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన శృతి హాసన్(Sruthi Hassan), తండ్రి పేరు ని ఎక్కువగా వాడుకోకుండా, కేవలం తన సొంత టాలెంట్ తో సినిమాలు చేస్తూ సౌత్ లోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరిగా మారింది. ఇప్పటికీ ఈమె నేటి తరం యంగ్ హీరోయిన్స్ తో సమానంగా సినిమా అవకాశాలను సంపాదిస్తూ ముందుకు దూసుకుపోతుంది. ఇదంతా పక్కన పెడితే తన తండ్రికి లాగానే శృతి హాసన్ కి కూడా ఎన్నో అఫైర్స్ ఉన్నాయని, లవ్ బ్రేకప్స్ జరిగాయని తమిళ ఇండస్ట్రీ లో ఎప్పటి నుండో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు శంతను హజారిక అనే ఆర్టిస్ట్ తో ప్రేమాయణం నడుపుతూ, అతనితో డేటింగ్ చేస్తూ వచ్చిన శృతి హాసన్, ఇప్పుడు అతనితో బ్రేకప్ చేసుకుంది. అదే విధంగా గతంలో కూడా ఆమెకు ఎన్నో బ్రేకప్స్ జరిగాయి.
Also Read: వామ్మో.. అస్సలు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఎన్టీఆర్ హీరోయిన్..
వాటి గురించి ఆమె రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఆమె మాట్లాడుతూ ‘నా మనసుకు ఎంతో ఇష్టమైన వాళ్ళను కొన్ని అనుకోని సందర్భాల కారణంగా బాధపెట్టాను. అలా చేసి ఉండకూడదు, తప్పు నాదే అని ఇప్పటికీ అనుకుంటూనే ఉంటాను. వాళ్లకు నా మనసులో ఇప్పటికీ క్షమాపణలు చెప్తూనే ఉంటా. ప్రతీ ఒక్కరి జీవితం లో బ్రేకప్స్ ఉంటాయి. మన మాజీ భాగస్వాముల వల్ల జీవితంలో ఎన్నో కొత్త విషయాలను నేర్చుకుంటూ ఉంటాము. నాకు అలాంటి బ్రేకప్ స్టోరీస్ తాలూకు అనుభవాలు చాలానే ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్కువగా ఆలోచించను. నేను కొత్తగా ఎవరితోనైనా రిలేషన్ లో ఉంటే, ఇది ఎన్నో నెంబర్ అని అడుగుతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో అది కేవలం ఒక నెంబర్ అయ్యుండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం నేను అన్ని సార్లు విఫలం అయ్యాను అని అర్థం’ అంటూ చెప్పుకొచ్చింది.
ఇంకా ఆమె మాట్లాడుతూ ‘నా కెరీర్ ప్రారంభం లో వరుసగా ఫ్లాప్ సినిమాలు వచ్చాయి. ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఒకానొక దశలో నాతో సినిమాలు చేసేందుకు ఎవ్వరూ ముందుకు వచ్చే వాళ్ళు కాదు. అలాంటి సమయం లో సిద్దార్థ్ నన్ను తన సినిమాలో హీరోయిన్ గా ఎంచుకున్నాడు. ఆ తర్వాత విడుదలైన ‘గబ్బర్ సింగ్’ చిత్రం నా జాతకాన్ని మార్చేసింది. ఈమధ్య కాలం సినిమాలు తగ్గించేసావు ఏమిటి అని అందరూ అడుగుతూ ఉంటారు. నేనేమి తగ్గించలేదు, కేవలం నా మనసుకి నచ్చిన సినిమాలను మాత్రమే చేసుకుంటూ వెళ్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చింది శృతి హాసన్. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా నటించిన ‘కూలీ’ చిత్రం షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పై దేశవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ చిత్రం తర్వాత ఆమె పలు తెలుగు సినిమాల్లో నటించడానికి సంతకాలు చేసింది.