Sreeleela And Meenakshi Chaudhary: ప్రస్తుతం యూత్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో శ్రీలీల(Sreeleela),మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) ముందు ఉంటారు. వీళ్లిద్దరు కలిసి ఇంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు(Superstar Mahesh Babu), త్రివిక్రమ్(Trivikram Srinivas) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గుంటూరు కారం’ చిత్రం లో నటించారు. ఇందులో శ్రీలీల మెయిన్ హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా నటించింది. మీనాక్షి పాత్రపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇంత అందమైన అమ్మాయిని సెకండ్ హీరోయిన్ గా పెట్టడం ఏంటి?, కనీసం ఆమెకు ఒక్క డైలాగ్ కూడా ఇవ్వలేదు. మహేష్ బాబు కి మంచి నీళ్లు అందించడం, టీ, కాఫీలు ఇవ్వడం కోసం మీనాక్షి చౌదరి ని తీసుకున్నారు అంటూ సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున ట్రోల్స్ నడిచాయి. అయితే మీనాక్షి చౌదరి కి అప్పట్లో పెద్దగా ఫేమ్ లేదు, హిట్స్ కూడా లేవు.
కానీ ఇప్పుడు మీనాక్షి చౌదరి శ్రీలీల కి ఏ మాత్రం తక్కువ కాదు. ఇంకా చెప్పాలంటే హిట్స్ పరంగా మీనాక్షి చౌదరి దే ప్రస్తుతానికి పై చెయ్యి. నటన లో అయితే శ్రీలీల మీనాక్షి కి దరిదాపుల్లోకి కూడా వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. రెండేళ్లలో ఎంత మార్పు వచ్చేసిందో చూడండి. అయితే ఈ ఇద్దరు హీరోయిన్స్ ఇప్పుడు మరోసారి కలిసి నటించబోతున్నారు. తమిళం లో ఇటీవల కాలంలో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ యూత్ ఐకాన్ గా మారిపోయిన ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) హీరో గా ఒక సినిమా చేయబోతున్నాడు. సైన్స్ ఫిక్షన్ జానర్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ నే దర్శకత్వం వహించబోతున్నాడు. గతం లో ఆయన లవ్ టుడే, కోమలి అనే చిత్రాలకు దర్శకత్వం వహించాడు. రెండు కూడా కమర్షియల్ గా సెన్సేషనల్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి.
‘లవ్ టుడే’ సినిమాతో హీరో గా మారిన ప్రదీప్ రంగనాథన్ ని చూసి, ఎదో టైం పాస్ కి హీరో గా నటించాడు, ఇతను మెయిన్ గా దర్శకత్వం వైపే ఫోకస్ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ హీరో గానే వరుసగా సినిమాలు చేస్తూ స్థిరపడిపోయాడు. ఇప్పుడు చాలా కాలం తర్వాత దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాని AGS ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో నిర్మించబోతోంది. ఇకపోతే ఈ చిత్రం లో మెయిన్ హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తి లేపుతున్న అంశం. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. వరుసగా మూడు సార్లు వంద కోట్ల గ్రాస్ సినిమాలను అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఈసారి ఏకంగా 200 కోట్ల గ్రాసర్ పై కన్నేశాడు.