Mohan Babu: గత ఏడాది సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా లో మంచు ఫ్యామిలీ ఏ రేంజ్ లో ట్రెండ్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మంచు మనోజ్, మంచు విష్ణు మధ్య విద్యానికేతన్ విశ్వవిద్యాలయం విషయం లో ఏర్పడిన మనస్పర్థలు చిలికి చిలికి గానివానలాగా మారి పెద్ద దుమారానికి తెరదీసింది. వీళ్ళ మ్యాటర్ లో మంచు మోహన్ బాబు కూడా కలుగచేసుకోవడం తో ఆ గొడవ తారాస్థాయికి చేరుకుంది. ఎంతలా అంటే మనోజ్, మోహన్ బాబులు ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో కేసులు వేసుకునే రేంజ్ కి వెళ్ళింది. ఇప్పటికీ వీళ్ళ మధ్య వివాదం సర్దుకోలేదు. కోర్టులో కేసు నడుస్తూనే ఉంది. మంచు మనోజ్ తన తండ్రికి, అన్నయ్య కి దూరం గానే ఉంటున్నాడు ప్రస్తుతం. అయితే మోహన్ బాబు పేరు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి వచ్చింది.
ప్రతీ ఏడాది లాగానే, ఈ ఏడాది కూడా మోహన్ బాబు తన సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం కోసం తిరుపతి కి వచ్చాడు. మోహన్ బాబు యూనివర్సిటీ లో భోగి పండుగ జరుపుకొని, సంక్రాంతి సంబరాలను ఎంజాయ్ చేస్తున్న మోహన్ బాబు ని ఇక్కడ కూడా మీడియా వదల్లేదు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కి చెందిన రిపోర్టర్ మోహన్ బాబు ని ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ చిరకాల మిత్రుడు చిరంజీవి లేటెస్ట్ చిత్రం మన శంకర వరప్రసాద్ గారు సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు వెళ్తోంది, దీనిపై మీ స్పందన ఏంటి? ‘ అని అడగ్గా, అందుకు మోహన్ బాబు సమాధానం చెప్తూ ‘ఇక్కడ కేవలం సంక్రాంతి సంబరాలు గురించి మాత్రమే మాట్లాడుకుందాం. సినిమాలు , రాజకీయాల గురించి వద్దు, నేను మాట్లాడను’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మోహన్ బాబు చిరంజీవి సినిమా గురించి ప్రస్తావన తీసుకొస్తే, మాట్లాడకుండా సైలెంట్ గా వెళ్లిపోయాడంటూ కొన్ని వెబ్ సైట్స్ ప్రచారం చేశాయి. ఇది చూసిన తర్వాత మీరు మారారు రా బాబు, సమయం సందర్భం లేకుండా , చిరంజీవి సినిమా ప్రస్తావన మోహన్ బాబు వద్దకు తీసుకొని రావడం, ఆ తర్వాత దానిపై ఇష్టమొచ్చినట్టు కథనాలు ప్రచురించడం అలవాటు అయిపోయింది. మంచిగా చెప్పినా, కటువుగా చెప్పినా మీరు మారారు రా బాబు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కాసేపు పక్కన పెడితే మోహన్ బాబు చాలా కాలం తర్వాత నాని ‘ది ప్యారడైజ్’ చిత్రం తో టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఈ సినిమాపై టాలీవుడ్ లో ప్రస్తుతం ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇలాంటి క్రేజీ ప్రాజెక్ట్ ద్వారా మోహన్ బాబు తన మూడవ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టబోతున్నాడు. ఈ జనరేషన్ ఆడియన్స్ ని ఆయన ఏ మాత్రం అలరిస్తాడో చూడాలి.