Dhanush And Mrunal Thakur: గత రెండు రోజుల నుండి సోషల్ మీడియా లో ధనుష్(Dhanush K Raja), మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) పెళ్లి గురించి వేరే లెవెల్ లో చర్చలు నడుస్తున్నాయి. వీళ్లిద్దరు రిలేషన్ లో ఉన్నారు అని చాలా కాలం నుండి మీడియా లో వినిపిస్తున్న వార్త. కానీ మృణాల్ ఠాకూర్ ఒక ఇంటర్వ్యూ లో మేము కేవలం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పడంతో కొంతమేరకు వీళ్ళ మధ్య రిలేషన్ ఉంది అనే వార్తలకు చెక్ పడింది. కానీ వీళ్ళ మధ్య జరుగుతున్నా కొన్ని సంఘటనలు చూస్తుంటే కచ్చితంగా వీళ్ళు రిలేషన్ లోనే ఉన్నారని తెలుస్తోంది. సోషల్ మీడియా లో ట్రోల్స్ మరియు ఇతర పరిణామాలకు భయపడే బయటపడడం లేదని అంతా అనుకుంటున్నారు. ఇదంతా పక్కన పెడితే వీళ్లిద్దరు ఇప్పుడు ఫిబ్రవరి 14 న వాలెంటైన్స్ డే సందర్భంగా పెళ్లి చేసుకోబోతున్నారంటూ సోషల్ మీడియా లో గత రెండు రోజులుగా బలమైన ప్రచారం జరుగుతోంది.
ఏకంగా ఫిలిం ఫేర్ సంస్థ నుండి ఈ విషయం నిర్ధారణ కావడం తో అందరూ నమ్ముతున్నారు. మరో పక్క ఈ వార్త ఇంతలా వైరల్ అవుతుంటే అటు మృణాల్ ఠాకూర్ నుండి కానీ, ఇటు ధనుష్ నుండి కానీ ఎలాంటి రియాక్షన్ రాలేదు. అంటే ఈ వార్త నిజమే అన్నమాట అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ధనుష్, మృణాల్ ఠాకూర్ ఒక ప్రైవేట్ హోటల్ లో కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలను చూసిన నెటిజెన్స్ అసలు మీరిద్దరూ కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు కదా, ఇంత క్లోజ్ గా ఉండే అవకాశాలు మీకు కలగలేదు, అయినప్పటికీ కూడా వ్యక్తిగతంగా ఇంత క్లోజ్ గా ఉన్నారంటే కచ్చితంగా మీరు రిలేషన్ లో ఉన్నట్టే అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఆ ఫోటోలకు సంబంధించిన ట్విట్టర్ లింక్ ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. సోషల్ మీడియా లో ప్రస్తుతం ఈ ఫోటోలు హాట్ టాపిక్ గా మారాయి. ఒకవేళ ధనుష్ సోషల్ మీడియా లో వినిపిస్తున్న కథనాలు ప్రకారం ఫిబ్రవరి 14న మృణాల్ ని పెళ్లి చేసుకుంటే, అది ఆయనకు రెండవ పెళ్లి అవుతుంది. మొదటి పెళ్లి సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య తో జరిగిన సంగతి తెలిసిందే. పాతికేళ్ళు వీళ్ళు కలిసి కాపురం చేశారు. ఈ దంపతులిద్దరికీ ఇద్దరు ఎదిగిన కొడుకులు కూడా ఉన్నారు. ఇలాంటి స్థితిలో ధనుష్ పెళ్లి చేసుకుంటే కచ్చితంగా ఆయన కొన్నాళ్ళు తీవ్రమైన నెగిటివిటీ ని ఎదురుకోవాల్సి వస్తుంది. మరో పక్క మృణాల్ ఠాకూర్ పై కూడా కొంత నెగిటివిటీ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుంది అనేది.
Is this movie scene ?
Or
Confirming the rumors? #dhanushmrunal #Dhanush #MrunalThakur https://t.co/GtKZTHj3a8 pic.twitter.com/YNPdMsSMGr
— Impactful Insights (@ImpactfulIn) January 16, 2026