https://oktelugu.com/

Sree Vishnu Remuneration: ఒక్క హిట్ తో రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిన శ్రీ విష్ణు.. ఇది మరీ ఓవర్ గా లేదూ..?

ఈ హీరో చేసే ప్రతీ సినిమా కొత్త రకంగానే ఉంటుంది కానీ, కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు. అది నిజంగా పాపం ఇతని బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. అడపాదడపా రెండు హిట్లు తగిలినా అది కెరీర్ కి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన 'సామజవరగమనా' చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

Written By:
  • Vicky
  • , Updated On : July 15, 2023 6:21 pm
    Sree Vishnu Remuneration

    Sree Vishnu Remuneration

    Follow us on

    Sree Vishnu Remuneration: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలలో మంచి టాలెంట్ ఉన్న నటుడు శ్రీ విష్ణు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజి లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ కుర్ర హీరో కి కెరీర్ ప్రారంభం లో చిన్న చిన్న పాత్రలు మాత్రమే దక్కాయి. కొన్ని సినిమాల్లో కమెడియన్ గా కూడా చేసాడు. అలా కెరీర్ లో వచ్చిన ప్రతీ అవకాశాన్ని సరైన పద్దతి లో వినియోగించుకొని నేడు హీరో గా నిలదొక్కుకున్నాడు.

    ఈ హీరో చేసే ప్రతీ సినిమా కొత్త రకంగానే ఉంటుంది కానీ, కమర్షియల్ సక్సెస్ మాత్రం ఇప్పటి వరకు దక్కలేదు. అది నిజంగా పాపం ఇతని బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. అడపాదడపా రెండు హిట్లు తగిలినా అది కెరీర్ కి ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు. కానీ రీసెంట్ గా విడుదలైన ‘సామజవరగమనా’ చిత్రం మాత్రం కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.

    రీసెంట్ గానే విడుదలైన ఈ చిత్రానికి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చింది. ఓపెనింగ్స్ పెద్దగా రాలేదు కానీ , రెండవ రోజు నుండి మాత్రం కలెక్షన్స్ ఒక రేంజ్ లో ఊపు అందుకున్నాయి. ఎక్కడ చూసిన థియేటర్స్ మొత్తం హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో కళకళలాడిపోయాయి. ఫలితంగా ఈ చిత్రానికి ఫుల్ రన్ లో దాదాపుగా 15 కోట్ల రూపాయిల రేంజ్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. పెద్ద హిట్ దక్కడం తో శ్రీ విష్ణు తన తదుపరి చిత్రాలకు భారీ మొత్తం లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడు.

    గత చిత్రాలలో ఆయనకీ కనీసం కోటి రూపాయిల రేంజ్ రెమ్యూనరేషన్ ని కూడా ఇచ్చేవాళ్ళు కాదు నిర్మాతలు. అలాంటిది ఇప్పుడు ఆయన ఏకంగా మూడు కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నాడట. ఇదే ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారిన అంశం, కేవలం ఒక్క సినిమాతో ఈ రేంజ్ డిమాండ్ చెయ్యడం ఎంత వరకు కరెక్ట్ అని కొంతమంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.