Sree Vishnu Vishnu Vinyasam : యంగ్ హీరోలలో మంచి కామెడీ టైమింగ్ ఉన్న నటుడు శ్రీ విష్ణు(Sree Vishnu). క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ ని ప్రారంభించి, ఆ తర్వాత హీరో గా మారి చిన్న చిన్న సినిమాలు చేస్తూనే మంచి గుర్తింపు ని సంపాదించుకున్నాడు. అలా కెరీర్ లో ప్రయాణం సాగిస్తూ వచ్చిన శ్రీ విష్ణు ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ హీరోస్ లో ఒకడిగా నిలిచాడు. విచిత్రమైన డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్ తో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సోషల్ మీడియా లో ట్రెండ్ అయ్యే మీమ్స్ ని కానీ, డైలాగ్స్ ని కానీ తన సినిమాలో వాడకుండా అసలు ఉండదు. ఆయన గత చిత్రం ‘సింగిల్’ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆయన ‘విష్ణు విన్యాసం'(Vishnu Vinyasam) అనే చిత్రం చేసాడు.
వారం రోజుల క్రితం ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని విడుదల చేసిన మేకర్స్, రీసెంట్ గానే ఈ చిత్రం లోని ‘దేఖో విష్ణు విన్యాసం’ అనే పాట ని లిరికల్ వీడియో సాంగ్ గా విడుదల చేశారు. ఈ పాటలో శ్రీ విష్ణు సిగ్నేచర్ స్టెప్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇందులో ఆయన ఒక స్టెప్పు వేస్తూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) సిగ్నేచర్ ని ఎగతాళి చేసినట్టు గా అనిపించింది. ఆ స్టెప్పు ఎలా ని ఇమిటేట్ చేస్తూ, శ్రీ విష్ణు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ ని చూస్తే అల్లు అర్జున్ పై సోషల్ మీడియా లో ఒక పాపులర్ బూతు మీమ్ గుర్తుకు వస్తుంది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఆ వీడియో చూసిన తర్వాత ఆ బూతు మీమ్ గురించి మేము ప్రత్యేకించి చెప్పనవసరం లేదు, మీకే అర్థం అయిపోతుంది.
అంతే కాకుండా అల్లు అర్జున్ ‘హ్యాపీ’ మూవీ లోని ఒక స్టెప్పుని కూడా శ్రీ విష్ణు రీ క్రియేట్ చేసినట్టుగా అనిపించింది. అయితే అల్లు అర్జున్ కి శ్రీ విష్ణు మంచి స్నేహితుడు. అల్లు అర్జున్ హీరో గా నటించితిన్ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ చిత్రం లో కూడా ఒక కీలక పాత్ర పోషించాడు శ్రీ విష్ణు. అంతే కాకుండా రీసెంట్ గానే అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థలో ఆయన ‘సింగిల్’ అనే సూపర్ హిట్ చిత్రాన్ని కూడా చేసాడు. అల్లు అర్జున్ తో ఆయన ఫ్యామిలీ తో శ్రీవిష్ణు కి మంచి సాన్నిహిత్యం ఉంది. అలాంటిది ఆయన మీద ఎలా సెటైర్లు వేస్తాడు చెప్పండి. ఇది కేవలం అల్లు అర్జున్ సైన్ ని ఇమిటేట్ చేయడం మాత్రమే అని తెలుస్తోంది. AA అని సినిమా మొదలయ్యే ముందు టైటిల్ ఎలా పడుతుందో, అలా విష్ణు విన్యాసాలు VV అని సిగ్నేచర్ రూపం లో చేసి చూపించాడు. కానీ మీమర్స్ తెలివితేటలు కారణంగా ఆ బూతు మీమ్ ని ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది.