The Raja Saab Day 3 Collections : ‘రాజా సాబ్'(The Rajasaab Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వసూళ్ల ట్రెండ్ ని చూస్తుంటే, ఈ సినిమా ప్రభాస్(Rebel Star Prabhas) కెరీర్ లోనే కాదు, టాలీవుడ్ హిస్టరీ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఒకటిగా నిలిచిపోతుందేమో అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. మొదటి రెండు రోజులు ప్రభాస్ క్రేజ్ కారణంగా ఈ సినిమాకు ఎంత నెగిటివ్ టాక్ వచ్చిన అద్భుతమైన వసూళ్లు వచ్చాయి. ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ చిత్రానికి రెండు రోజుల్లో 134 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కానీ ఎంత ప్రభాస్ అయినా కంటెంట్ లేని సినిమాని ఎంత వరకు లాగగలడు చెప్పండి?, మూడవ రోజు ఈ చిత్రానికి ఎవ్వరూ ఊహించని రేంజ్ డ్రాప్స్ నమోదు అయ్యాయి. సాధారణంగా ఆదివారం రోజున స్టార్ హీరోలకు సంబంధించిన ఫ్లాప్ సినిమాలు మంచి వసూళ్లను నమోదు చేసుకునేవి.
కానీ ప్రభాస్ ‘రాజా సాబ్’ చిత్రానికి మాత్రం రెండవ రోజు తో పోలిస్తే 70 శాతం కి పైగా డ్రాప్స్ సొంతం అయ్యాయి. రెండవ రోజు ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల రూపాయిల పైగా గ్రాస్ వసూళ్లు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి. కానీ మూడవ రోజు కేవలం 5 కోట్ల గ్రాస్ వసూళ్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అయ్యాయి. దీనిని బట్టీ ఈ చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనేది అర్థం చేసుకోవచ్చు. కనీసం కరెంటు బుకింగ్స్ ద్వారా అయినా ఈ సినిమా పికప్ అవ్వుద్దేమో అని అంతా అనుకున్నారు. కానీ ఎలాంటి మూవ్మెంట్ లేదు. కానీ నైజాం ప్రాంతం లో మాత్రం నేడు కూడా ఈ చిత్రానికి డీసెంట్ వసూళ్లు నమోదు అయ్యాయి. ఈ ప్రాంతం ప్రభాస్ కి కంచుకోట లాంటిది అని ఎందుకు అందరు అంటూ ఉంటారో ఈ చిత్రానికి ఆ ప్రాంతం లో నమోదు అవుతున్న వసూళ్లను చూసి చెప్పొచ్చు .
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో మాత్రం దారుణంగా వసూళ్లు పడిపోయాయి. మళ్లీ కోలుకుంటుంది అనే నమ్మకం కూడా బయ్యర్స్ లో లేదు. ఆ రేంజ్ లో దెబ్బ కొట్టింది ఈ చిత్రం. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి మూడవ రోజున రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 10 కోట్ల రూపాయిల లోపే షేర్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయని అంటున్నారు. ఇక రేపు సోమవారం, పైగా చిరంజీవి కొత్త సినిమా విడుదల , ఆ సినిమా తాలూకా ప్రభావం దీనిపై ఏ రేంజ్ లో పడుతుందో చూడాలి. మరి కాసేపట్లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీమియర్ షోస్ ప్రారంభం కానున్నాయి.