Samajavaragamana Collections: ఈమధ్య కాలం లో చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టిస్తున్నాయి. పెద్ద సినిమాల హవా బాగా తగ్గిపోతుంది. విడుదలైన ప్రతీ పెద్ద సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండడం బయ్యర్స్ కి మింగుడు పడని విషయం. మరో పక్క చిన్న సినిమాలు మాత్రం కుమ్మేస్తున్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ ఈ ఏడాది విడుదలైన ‘బలగం’ అనే చిత్రం.
ఇప్పుడు అదే రూట్ లో మరో చిన్న సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము లేపేస్తుంది. ఆ చిత్రం పేరే శ్రీ విష్ణు హీరో గా నటించిన ‘సామజవరగమనా’ అనే చిత్రం. రీసెంట్ గానే విడుదలైన ఈ సినిమాకి మొదటి ఆట నుండే సూపర్ హిట్ టాక్ వచ్చింది. కానీ ఓపెనింగ్స్ విషయం మొదటి రెండు రోజులు బాగా దెబ్బతినింది. కానీ మూడవ రోజు నూన్ షోస్ నుండే ఈ చిత్రం ఒక రేంజ్ లో పికప్ అయ్యింది.
ముఖ్యంగా అమెరికా లో ఈ సినిమాకి మొదటి రోజు వచ్చిన వసూళ్లు కంటే మూడవ రోజు వచ్చిన వసూళ్లు డబుల్ ఉన్నాయట. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లో కూడా ఇదే పరిస్థితి.మొదటి మూడు రోజులకు గాను అమెరికా లో ఈ చిత్రానికి రెండు లక్షల 50 వేల డాలర్స్ ని రాబట్టింది అట. ఇది శ్రీ విష్ణు కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ లో కూడా ఇదే పరిస్థితి.
ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రం ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ మూడు కోట్ల 20 లక్షల రూపాయలకు జరిగిందట. అయితే మూడు రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వసూళ్లు దాదాపుగా నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉంటుందట. అంటే 40 లక్షల రూపాయిలు లాభం అన్నమాట. ఫుల్ రన్ లో ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి.