Sree Vishnu: సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది యంగ్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే శ్రీ విష్ణు లాంటి నటుడు కెరియర్ మొదట్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూ వచ్చినప్పటికి ఆ తర్వాత హీరోగా మారి తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకునే విధంగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతానికి ఆయన సినిమాలు తెలుగుకే పరిమితం అవుతున్నప్పటికి ఫ్యూచర్లో పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
Also Read: పాక్ బంకర్ల పాలిట మృత్యుపాశం.. భారత్ ఏటీజీఎం
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా మంచి గుర్తింపును సంపాదించుకున నటుడు శ్రీ విష్ణు (Sri Vishnu)… తనదైన రీతిలో సత్తా చాటడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట సాధించబోయే విజయాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. గత సంవత్సరం సామజవరగమన సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ఆ తర్వాత వచ్చిన స్వాగ్ సినిమాతో ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయాడు. ఇక ఈరోజు ‘సింగిల్’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఈ సినిమా కూడా ఆశించిన మేరకు ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేక పోయిందనే చెప్పాలి… తన క్యారెక్టర్ లో ఉన్న ఇంటెన్స్ ని పెర్ఫామ్ చేసి చూపించాడు. కానీ సినిమా స్టోరీ లోనే చాలావరకు మిస్టేక్స్ ఉండడంతో సినిమా చూసే ప్రేక్షకుడికి కొంతవరకు బోర్ కొట్టించే అవకాశం అయితే ఉంది. గీత ఆర్ట్స్ బ్యానర్ నుంచి వచ్చిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉండేవి. కానీ ఈ సినిమాని చూసిన ప్రేక్షకుడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. శ్రీ విష్ణు ఎందుకని తన సినిమాల సెలక్షన్లో వేరియేషన్స్ చూపించడం లేదు.
ఒకప్పుడు మంచి కథలను ఎంచుకొని సినిమాలుగా చేస్తూ ప్రేక్షకుల మెప్పు పొందిన వాడు ఇప్పుడు మాత్రం ఏ మాత్రం క్వాలిటీ లేని కథలను ఎంచుకొని సినిమాలు గా చేస్తున్నాడు. దానికి కారణమేంటి ఎందుకు ఆయన ఇంతకు ముందులా సినిమాలు చేయడం లేదు అంటూ కొంతమంది అతని మీద కొన్ని కామెంట్లైతే చేస్తున్నారు.
గతంలో ఆయన బ్రోచేవారేవరూరా, మెంటల్ మదిలో, సమాజవరగమన లాంటి మంచి సినిమాలను చేశాడు. దాంతో అతనికి చాలా మంచి టేస్ట్ ఉందని విమర్శకులు సైతం అతన్ని ప్రశంసించారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన రొటీన్ సినిమాలనే ఎంచుకుంటూ ఏమాత్రం వైవిధ్యాన్ని ప్రదర్శించకుండా కళ్ళు జోకులతో సినిమాలను సాగించాలనే ప్రయత్నం చేస్తున్నాడు.
ఇక ఇలాగే ఆయన కెరియర్ ను కనక కొనసాగించినట్లయితే మాత్రం తను వీలైనంత తొందరగా ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయిపోయే అవకాశాలైతే ఉన్నాయి. అలా కాకుండా ఒకప్పుడు ఆయన చేసిన ఎక్స్పరిమెంటల్ సినిమాలని మరోసారి చేసుకుంటూ ముందుకు సాగితే ఆయన చాలా కాలం పాటు స్టార్ హీరోగా వెలుగొందే అవకాశాలు కూడా ఉన్నాయి…