NTR, Vanisri: ఆ రోజుల్లో పాత తరం నటీనటులు షూటింగ్ సమయంలో అందరూ కలిసి భోజనం చేసేవాళ్లు. అప్పటికే ఎన్టీఆర్ ఆహారపు అలవాట్ల గురించి రకరకాల పుకార్లు వినిపించేవి. అప్పుడే కొత్తగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వాణిశ్రీ కూడా ఆ భోజనం చేసే బ్యాచ్ లో ఉంది.

ఆమె చూపు అంతా ఎన్టీఆర్ మీదే ఉంది. ఆయన గురించి తాను విన్నది నిజామా ? అబద్దమా ? అని తెలుసుకోవాలనేది ఆమె తాపత్రయం.

అందరూ కూర్చున్నారు. భోజనాలు వడ్డిస్తున్నారు. ఆ రోజుల్లో ఎవరి క్యారేజీ వారి ఇంటి నుండి వచ్చేది. కానీ ఎన్టీఆర్ కు మాత్రం రెండు క్యారేజీలు వచ్చాయి. పైగా అవి చాలా పెద్దవి. వాణిశ్రీ వాటిని చూసి.. తాను విన్న మాటలు నిజమే అనుకుంది మనసులో. మరోపక్క ఎన్టీఆర్ భోజనం చేయడం మొదలుపెట్టారు. అప్పటికే అందరికీ విషయం అర్థమైంది. అందుకే, ఎవరూ ఎన్టీఆర్ వైపు ఆశ్చర్యంగా చూడటం లేదు.
కానీ, వాణిశ్రీ మాత్రం ఎన్టీఆర్ వైపే నోరెళ్ళబెట్టి చూస్తోంది. అది గమనించారు ఎన్టీఆర్. ‘ఏమిటి వాణిశ్రీ గారు. మా భోజనం రుచి చూస్తారా ?, లేక అలాగే చూస్తూ ఉండిపోతారా ?’ అని పలకరించారు. దాంతో ఉలిక్కిపడ్డ వాణిశ్రీ ‘లేదు అన్నగారు’ అంటూ తల దించుకుంది. కానీ, ఎన్టీఆర్ మాత్రం ఆమె చేత తన క్యారేజిలోని అన్ని వంటకాలను దగ్గర ఉండి మరీ తినిపించారు.
అయితే, ఆ పూట భోజనం మాత్రం వాణిశ్రీ జీవితంలోనే శాశ్వతంగా గుర్తుండిపోయిందట. నిజంగానే సీనియర్ ఎన్టీఆర్ గారి ఆహారపు అలవాట్లు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఎన్టీఆర్ తెల్లారి అనగా ఉదయం 5 గంటల సమయంలోనే అరచేతి మందంలో ఉండే నేతి ఇడ్లీలను 20కు పైగా అతి సులువుగా తినేసేవారు. అలాగే ఎన్టీఆర్ కి పెరుగు అంటే ఎంతో మక్కువ.
ఇడ్లీ తినగానే ఆయనకు పెరుగన్నం తినడం కూడా బాగా ఇష్టం. ఆ పెరుగన్నంలో ఆవకాయ తప్పనిసరి. ఇక షూటింగ్ విరామం సమయంలో ఎన్టీఆర్ ఎక్కువగా ఆపిల్ జ్యూస్ తాగేవారు. ఒక్క షూటింగ్ లోనే ఆయన రోజు మొత్తంలో ఐదు బాటిళ్ల ఆపిల్ జ్యూస్ ను తాగేవారట. అలాగే సాయంత్రం బజ్జీలు, డ్రై ఫ్రూట్స్ తినడానికి ఎన్టీఆర్ ఎక్కువ ఆసక్తి చూపించేవారు.
Also Read: మహేష్-రాజమౌళి కాంబోపై ఎన్టీఆర్, చరణ్ సెటైర్లు..!
అందుకే, ప్రతిరోజూ రెండు లీటర్ల బాదం పాలను ఆయన కోసం ఎప్పుడూ సిద్ధంగా ఉంచేవారు. ఎన్టీఆర్ కూడా క్రమం తప్పకుండా బాదం పాలను తాగేవారు. అయితే, సమ్మర్ లో మాత్రం లంచ్ సమయంలో ఎన్టీఆర్ కచ్చితంగా మామిడికాయల జ్యూస్ తాగేవారు. పైగా మామిడి పళ్ల రసంలో ఎన్టీఆర్ గ్లూకోజ్ పౌడర్ కలుపుకునే వారు. మధ్యలో ఆయనకు అప్పుడప్పుడు గొంతు సమస్య వస్తుండేది. అప్పుడు అల్లం వెల్లుల్లి ముద్దను ఆయన తినేవారు.
ఏది ఏమైనా ఎంత ఆహారం తీసుకున్నా ఎన్టీఆర్ హరాయించుకునే వారు. ఆయన శరీరం కూడా ఆయన మాట వినేది. ఆహారం అదుపు తప్పినా ఆయన శరీరం ఆయనకు సహకరించేది. అందుకే ఎన్టీఆర్ గారు తాను తీసుకునే ఆహారం విషయంలో ఎలాంటి నియమాలు పెట్టుకునేవారు కాదు.
Also Read: బికినీలో సమంత.. శృతిమించిన అందాల ఆరబోత !