Squid Games 3 Trailer Review: మన తెలుగు ఆడియన్స్ కూడా కొరియన్ వెబ్ సిరీస్ మరియు కొరియన్ సినిమాలను బాగా ఇష్టపడుతారు అనే విషయం ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. లాక్ డౌన్ సమయంలో ఓటీటీ లలో కాలక్షేపానికి అప్పట్లో కొరియన్ డ్రామాలనే ఎక్కువగా చూసేవారు. కేవలం సాధారణ ప్రేక్షకుల్లో మాత్రమే కాదు, సెలబ్రిటీస్ లో కొరియన్ డ్రామాలు మంచి క్రేజ్ ఉంది. అలా మన తెలుగోళ్లు అత్యధికంగా ఇష్టపడిన కొరియన్ వెబ్ సిరీస్ లలో ఒకటి ‘స్క్విడ్ గేమ్స్'(Squid Games). కరోనా లాక్ డౌన్ సమయం లో నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అయిన ఈ వెబ్ సిరీస్ ప్రపంచవ్యాప్తంగా ఒక సంచలనం సృష్టించింది. రెండవ వెబ్ సిరీస్ కోసం అన్ని దేశాలకు సంబంధించిన వాళ్ళు ఆతృతగా ఎదురు చూసేలా చేసింది. గత ఏడాది డిసెంబర్ 26 న ‘స్క్విడ్ గేమ్స్ 2’ స్ట్రీమింగ్ అయ్యింది.
నాలుగైదు ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి కానీ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపర్చింది. ఈ సీజన్ తోనే ఈ వెబ్ సిరీస్ అయిపోవాల్సింది, కానీ మేకర్స్ సాగదీస్తూ చివరి సీజన్ అంటూ ప్రకటించారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే ఎట్టకేలకు చివరి సీజన్ కి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం పూర్తి అయ్యింది. ఈ నెల 27 నుండి ఈ చివరి సీజన్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ సీజన్ కి సంబంధించిన టీజర్ ని విడుదల చేశారు. నిన్న ట్రైలర్ ని కూడా విడుదల చేశారు. ఈ ట్రైలర్ కి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. చూస్తుంటే మొదటి రెండు సీజన్స్ కంటే చివరి సీజన్ లోనే గేమ్స్ అత్యంత భయంకరంగా డిజైన్ చేసినట్టుగా అనిపించింది. యూట్యూబ్ లో ట్రెండ్ అవుతున్న ఈ ట్రైలర్ ని మీరు కూడా చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
రెండవ సీజన్ లో హీరో తోటి ఆటగాళ్లతో కలిసి స్క్విడ్ గేమ్స్ నిర్వహిస్తున్న సైనికులపై తిరుగుబాటు చేయడం మొదలుపెడుతాడు. ఈ తిరుగుబాటులో అత్యధిక మంది సానికులను చంపేయడం లో హీరో సక్సెస్ అవుతాడు కానీ, బాస్ దగ్గరకి చేరుకునేలోపు దొరికిపోతాడు. అక్కడితో రెండవ సీజన్ ముగుస్తుంది, క్లైమాక్స్ మూడవ సీజన్ లో చూసి తెలుసుకోండి అనే క్యూరియాసిటీ ని పెంచే ప్రయత్నం చేసాడు కానీ, అది మిస్ ఫైర్ అయ్యింది. కానీ సీజన్ 3 చూస్తుంటే వళ్ళు గగురుపొడిచే ఆటలతో పాటు, మంచి ఎమోషన్ కూడా ఉన్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఈ చివరి సీజన్ కి ఆడియన్స్ మంచి ఫేర్ వెల్ ఇచ్చేట్టుగా అనిపిస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఈ గేమ్స్ లో కూడా హీరో ఒక్కడే మిగిలేలా ఉన్నాడు. చివరికి ఏమి జరుగుతుంది అనేది కాస్త ఆసక్తిగానే ఉంది, చూడాలి మరి.