Spirit Movie Prabhas Look: రెబల్ స్టార్ ప్రభాస్(Rebel Star Prabhas), సందీప్ వంగ(Sandeep Vanga) కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘స్పిరిట్'(Spirit Movie) చిత్రం పై అభిమానులు, ప్రేక్షకులు ఎన్ని అంచనాలు అయితే పెట్టుకోవాలో, అన్ని అంచనాలను పెట్టుకోవచ్చు అనే విధంగా ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇందులో ప్రభాస్ ని సందీప్ వంగ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ లో చూపించబోతున్నాడు. అంతే కాకుండా ఆయన క్యారక్టర్ లో అనేక బోల్డ్ షేడ్స్ ని కూడా బయటపెట్టే పనిలో ఉన్నాడు సందీప్. ఇప్పటి వరకు ప్రభాస్ అభిమానులు కలలో కూడా ఊహించని లుక్స్ లో కూడా ఈ చిత్రం లో చూపించబోతున్నాడు సందీప్ వంగ. బాహుబలి సిరీస్ తర్వాత ఏ డైరెక్టర్ కూడా ప్రభాస్ లోని నటన ని సరిగ్గా వాడుకోలేదు. కానీ ‘స్పిరిట్’ చిత్రం లో ప్రభాస్ యాక్టింగ్ క్యాలిబర్ ని మొత్తం బయటపెట్టే పనిలో ఉన్నాడు సందీప్ వంగ.
Also Read: ఈ నెలలో అదిరిపోయే సినిమాలు.. 21 క్యూ.. ఏవి చూసేవంటే…
రీసెంట్ గానే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ పూర్తి అయ్యింది. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ కి నేడే చివరి వర్కింగ్ డే. మొత్తం మీద నాలుగు రోజుల పాటు షూటింగ్ జరగ్గా రెండు రోజులు తెల్లవారు జామున షూటింగ్ చేయగా, మరో రెండు రోజులు రాత్రి సమయం లో షూట్ చేశారు. ఈ షెడ్యూల్ లో ప్రభాస్ పవర్ ఫుల్ ఖైదీ లుక్ లో కనిపించగా, హీరోయిన్ త్రిప్తి దిమిరి అద్భుతమైన చీర కట్టులో కనిపించింది. అయితే ఈ షూటింగ్ కి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ఇందులో ప్రభాస్ గుండు లుక్ తో, తెల్లని ఖైదీ బట్టలతో కనిపించడం చూసి ఫ్యాన్స్ షాక్ కి గురయ్యారు. ప్రభాస్ ని ఏంటి ఈ యాంగిల్ లో చూపిస్తున్నాడు. సందీప్ వంగ మామూలుడు కాదు బాబోయ్ అంటూ సోషల్ మీడియా లో ప్రభాస్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన రెండవ షెడ్యూల్ ని ఈ నెలలోనే మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ చిత్రం షూటింగ్ ని సాధ్యమైనంత తొందరగా పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లానింగ్ జరుగుతుందని టాక్. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రం లో మెగాస్టార్ చిరంజీవి ఉన్నాడా?, లేదా? అనే విషయం పై ఇంకా స్పష్టమైన క్లారిటీ రాలేదు. కొన్ని రోజుల క్రితం ఇందులో చిరంజీవి ప్రభాస్ కి తండ్రి క్యారక్టర్ లో కనిపించబోతున్నాడని చెప్పారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని సందీప్ వంగ రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. కానీ చిరంజీవి ఈ సినిమా ప్రారంభోత్సవానికి హాజరు అవ్వడాన్ని చూస్తుంటే కచ్చితంగా ఎదో సర్ప్రైజ్ ఇచ్చేందుకు సందీప్ వంగ గట్టి ప్లాన్ చేసాడని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఆడియన్స్ ని ఇంకెంత సప్రైజ్ చేస్తుంది అనేది.