https://oktelugu.com/

Spirit: స్పిరిట్, కల్కి2, డ్రాగన్, RC 16 వీటిలో 2000 కోట్లు కొల్లగొట్టే సినిమా ఏది..? ఆ ఒక్క సినిమాకే ఎక్కువ ఛాన్స్ ఉందా..?

సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్లు చేసే సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాలని చూస్తుంటారు. ఇండస్ట్రీ హిట్టు కొట్టాలని ప్రతి ఒక్కరు ప్రయత్నిస్తుంటారు. కానీ అది అందరికి అన్నివేళలా సాధ్యం అవ్వదనే చెప్పాలి...కారణం ఏంటంటే ప్రతి హీరో తం బాడీ లాంగ్వేజ్ కు తగ్గట్టుగా సినిమాలను ఎంచుకొని ముందుకు సాగినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది...

Written By: , Updated On : February 19, 2025 / 08:44 AM IST
Spirit

Spirit

Follow us on

Spirit: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ బాలీవుడ్ ఇండస్ట్రీ తో పోటీ పడుతున్న విషయం మనకు తెలిసిందే. ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలో తెలుగు సినిమాలకి మంచి గుర్తింపైతే దక్కుతుంది. అలాగే నార్త్ లో సైతం మన సినిమాల హవా ఎక్కువగా కొనసాగుతూ ఉండడంతో బాలీవుడ్ ని పక్కకు నెట్టి తెలుగు సినిమా ఇండస్ట్రీ ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ గా నిలుస్తుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచే భారీ సినిమాలు వస్తున్నాయి. కాబట్టి పెను ప్రభంజనం సృష్టించడానికి కూడా మన హీరోలు దర్శకులు సిద్ధమవుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన దంగల్ (Dangal) సినిమా భారీ విజయాన్ని సాధించింది. మరి ఈ సినిమాతో అమీర్ ఖాన్ (Ameer khan) ఒక్కసారిగా పాన్ ఇండియాని షేక్ చేశాడు… 2000 కోట్ల క్లబ్ లో చేరిన ఏకైక చిత్రంగా దంగల్ సినిమా నిలిచింది. మరి రాబోయే సినిమాలతో తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి వస్తున్న సినిమాల్లో ఏ సినిమాకి 2000 కోట్ల కలెక్షన్స్ కలెక్ట్ చేసే దమ్ముంది అంటూ కొన్ని వార్తలైతే బయటికి వస్తున్నాయి. నిజానికి ప్రభాస్ హీరోగా వస్తున్న స్పిరిట్ (Spirit) సినిమాకి 2000 కోట్ల మార్క్ ను టచ్ చేసే గట్స్ ఉన్నాయంటూ ఆ సినిమా దర్శకుడు అయిన ‘సందీప్ రెడ్డివంగ’ (Sandeep Reddy Vanga) ఓపెన్ గా స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో ఇంతకు ముందు మనం ఎప్పుడు చూడనటువంటి ప్రభాస్ చూపించబోతున్నారట. మరి ఆయన అనుకున్నట్టుగానే ఈ సినిమా 2000 కోట్ల మార్క్ ను టచ్ చేస్తుందట.

ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ ఒక పెను ప్రభంజనాన్ని సృష్టించిన వాడు అవుతాడు…కల్కి 2 (Kalki 2) సినిమాకి కూడా 2000 కోట్ల మార్కును టచ్ చేసే అవకాశమైతే ఉంది. ఇక ఇప్పటికే ఇది 1200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టింది.కాబట్టి 2000 కోట్ల మార్క్ ను టచ్ చేయడం అనేది అంత పెద్ద విషయమైతే కాదు.

కాబట్టి ఈ సినిమాతో ఆయన ఈజీగా ఆ మార్క్ ను సాధిస్తాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక నాగ్ అశ్విన్ ఈ సినిమా మీద ఇప్పటికే తీవ్రమైన కసరత్తులైతే చేస్తున్నాడు… ఇక వీటితోపాటుగా ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తున్న డ్రాగన్ (వర్కింగ్ టైటిల్) సినిమా కూడా 2000 కోట్ల కలెక్షన్స్ ను టార్గెట్ గా పెట్టుకొని బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలతో పాటు రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమా కూడా 2000 కోట్ల కలెక్షన్స్ ని కొల్లగొట్టే అవకాశం అయితే ఉందని కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాలను తెలియజేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమాల్లో ఏ సినిమా ఇండస్ట్రీ హిట్ ను నమోదు చేస్తుందనేది…