sandeep reddy vanga (2)
Sandeep Reddy Vanga: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సందీప్ రెడ్డి వంగ(Sandeep Reddy Vanga) కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేశాడు. అలాంటి స్టార్ డైరెక్టర్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఆయన చేసిన ‘అనిమల్ ‘ సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ గుర్తింపును తీసుకొచ్చింది. ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరిని మెప్పించడమే కాకుండా సందీప్ రెడ్డి వంగకి సపరేట్ స్టైల్ ఉందని ప్రతి ఒక్కరు గుర్తించేలా చేసింది. ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కతంశమైతే ఉంటుందనేది వాస్తవం… ఇక సినిమాలోని సీన్లు బోల్డ్ గా ఉండడమే కాకుండా ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేసే విధంగా ఉంటాయి. మరి ఏది ఏమైనా కూడా రొమాన్స్ కి వల్గారిటీ కి మధ్య ఉండే గీతను ఎప్పుడు చెరపకుండా ఒక మంచి ఫీల్ ఉన్న సినిమాను చేయడంలో సందీప్ రెడ్డివంగ ఎప్పుడు సక్సెస్ అవుతూనే వస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రభాస్ తో ‘స్పిరిట్’ (Spirit) అనే సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.
ఇక ఇదిలా ఉంటే అర్జున్ రెడ్డి సినిమా సందీప్ రెడ్డి వంగ నిజీవితం ఆధారంగా తీశారు అని చాలామంది చెప్తూ ఉంటారు. రీసెంట్ గా తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగచైతన్య (Naga Chaithanya) మాట్లాడుతూ అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యారెక్టర్ నిజ జీవితంలో సందీప్ రెడ్డి వంగ క్యారెక్టర్ అంటూ ఆయన చేసిన మాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో అర్జున్ రెడ్డి సినిమాలో అన్ని కోల్పోయిన హీరో ఇక చేయాలో అర్థం అవ్వక డ్రగ్స్ కూడా తీసుకుంటాడు. ఇక సందీప్ తన నిజ జీవితంలో అలాంటి డ్రగ్స్ తీసుకున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మరి ఏది ఏమైనా కూడా డ్రగ్స్ అనేది సినిమాలో సినిమాటిక్ లిబర్టీ తీసుకుని ఆడ్ చేసిన సీన్స్ తప్ప నిజ జీవితంలో సందీప్ రెడ్డి వంగ కి డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని కొంతమంది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ సందీప్ రెడ్డి వంగ మాత్రం ఈ సినిమా స్టోరీ తన నిజ జీవితపు స్టోరీ అని ఎక్కడ చెప్పడం లేదు. సందీప్ నిజ జీవితంలో కూడా ఆర్థోపెడిక్ డాక్టర్ కోర్స్ చదువుకున్నాడు…
ఇక సినిమాలో కూడా అర్జున్ రెడ్డి ఆర్థో పెడిక్ డాక్టర్ గా కనిపిస్తాడు. అలాగే సినిమాలో సందీప్ కి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం అంట… అర్జున్ రెడ్డి కూడా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం…ఇలాంటి సిమిలారిటీస్ తో సినిమాని తీయడం వల్ల సందీప్ రెడ్డివంగ నిజజీవితపు స్టోరీని అర్జున్ రెడ్డి గా కన్వర్ట్ చేసి తీశారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. మరి ఈ విషయాల మీద సందీప్ రెడ్డివంగ స్పందిస్తే బాగుంటుందని పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…