Prabhas Spirit Movie Updates: ఈ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ విడుదలైన ‘రాజా సాబ్'(The Rajasaab) చిత్రం కమర్షియల్ గా ఎలాంటి డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రభాస్(Rebel Star Prabhas) ఫ్యాన్స్ ఈ సినిమా పేరు వినగానే వణికిపోయే రేంజ్ ఫ్లాప్ అయ్యింది. దాదాపుగా థియేట్రికల్ రన్ ని కూడా పూర్తి చేసుకుంది ఈ చిత్రం. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ దాదాపుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో నిర్మించింది. విడుదలకు ముందు అంత రేంజ్ బిజినెస్ జరగలేదు. ఇక విడుదల తర్వాత సంగతి గురించి చెప్పాల్సిన పని లేదు. పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయింది ఈ చిత్రంతో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. వేరే నిర్మాణ సంస్థ అయితే ఈపాటికి మూత పడిపోయి ఉండేది. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కి ప్రపంచవ్యాప్తమగు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ నిలబడ్డాడు.
కేవలం ‘రాజా సాబ్’ చిత్రం మాత్రమే కాదు, ఈ సంస్థ నుండి ఈమధ్య కాలం లో వచ్చిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. గత ఏడాది విడుదలైన ‘మిరాయ్’ చిత్రం ఒక్కటే కాస్త ఈ సంస్థకు లాభాలను తెచ్చిపెట్టాయి. ఇకపోతే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ని చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఇప్పుడు వణికిపోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం సందీప్ వంగ ప్రభాస్ తో చేస్తున్న ‘స్పిరిట్'(Spirit Movie) మూవీ తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ ఈ సంస్థ చేతుల్లోనే ఉంది అట. గతం లో ఈ సంస్థ ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీ తెలుగు థియేట్రికల్ రైట్స్ ని సొంతం చేసుకుంది. ఈ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయ్యిందో మనమంతా చూసాము. ప్రభాస్ తో ఈ సంస్థ కలయిక అసలు కలిసిరావడం లేదు. రెండు సార్లు చావు దెబ్బ తగిలింది.
ప్రభాస్ ఫ్యాన్స్ కి ‘స్పిరిట్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. ఈ సినిమా మీదనే వాళ్ళు కోటి ఆశలు పెట్టుకున్నారు. ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల గ్రాస్ కొట్టేంత సత్తా ఉంది. అలాంటి ప్రాజెక్ట్ ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చేతుల్లో పెట్టడం ఏ మాత్రం కరెక్ట్ కాదంటూ సందీప్ వంగ ని ప్రభాస్ ఫ్యాన్స్ ట్యాగ్ చేసి అడుగుతున్నారు. ఈ సంస్థ కొనుగోలు చేసిన సినిమాలకు సరైన రిలీజ్ లు ఇవ్వరు , నైజాం ప్రాంతం లో ఈ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ తో టై అయ్యి ఉంటుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ‘రాజా సాబ్’ కి ఆ ప్రాంతం లో ఎలాంటి నష్టం చేసిందో అందరూ కళ్లారా చూశారు. ఇప్పుడు కేవలం మొదటి రోజే నైజం ప్రాంతం లో 30 కోట్ల షేర్ ని రాబట్టేంత సత్తా ఉన్నటువంటి ‘స్పిరిట్’ ని ఆ రెండు నిర్మాణ సంస్థల చేతుల్లో పెట్టి నాశనం చేయొద్దని స్పిరిట్ మేకర్స్ ని ప్రాధేయపడుతున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. మరి మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ మాటలను పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది చూడాలి.
