Spirit And Varanasi: 2027..ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లోని మూవీ లవర్స్ అందరూ మన టాలీవుడ్ వైపు చూసే సంవత్సరం. రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా నటిస్తున్న ‘స్పిరిట్’, మహేష్ బాబు -రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘వారణాసి’, ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’, అల్లు అర్జున్ – అట్లీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న #AA23 , ఇలా ఇంటర్నేషనల్ మార్కెట్ లను షేక్ చేసే సినిమాలన్నీ ఒకే సంవత్సరం లో రాబోతున్నాయి. అయితే మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్న ప్రభాస్ స్పిరిట్, మహేష్ బాబు వారణాసి చిత్రాలు మాత్రం ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి అనేది లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న వార్త. సంక్రాంతి సందర్భంగా డైరెక్టర్ సందీప్ వంగ ‘స్పిరిట్’ చిత్రాన్ని మార్చి 5 న విడుదల చేయబోతున్నట్టు అధికారిక ప్రకటన చేసాడు.
‘వారణాసి’ చిత్రాన్ని కూడా ప్రస్తుతానికి అదే నెలలో విడుదల;ఆ చేసే ప్లాన్ లో ఉన్నాడట డైరెక్టర్ రాజమౌళి. ఈ ఏడాది సెప్టెంబర్ లోపు ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి అవుతాయట. కేవలం VFX కి సంబంధించిన వర్క్ మీద మాత్రమే ఫోకస్ పెడతారట మేకర్స్. ఈ సినిమా VFX వర్క్ కోసం ఏకంగా హాలీవుడ్ సంస్థలు పని చేయబోతున్నాయట. ఇప్పటికే కొంత పార్ట్ VFX ని కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. మహేష్ బాబు శ్రీ రాముడి లుక్ లో కనిపించే షాట్ ని వేరే లెవెల్ లో షూట్ చేశారట మేకర్స్. ఇది ఈ ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ లుక్ వచ్చిన తర్వాత సోషల్ మీడియా లో మొత్తం షేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం ‘స్పిరిట్’ తో పోటీ పడితే పూర్తి స్థాయి పొటెన్షియల్ ని చూపించడం కష్టమేనా?.
కేవలం వారణాసి కి మాత్రమే కాదు, స్పిరిట్ చిత్రానికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద పూర్తి స్థాయి పొటెన్షియల్ చూపించే అవకాశం ఉండదు. రెండు కూడా 3000 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే సత్తా ఉన్న సినిమాలే. కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నా విడుదల సమయానికి కచ్చితంగా ఎదో ఒక సినిమా వెనక్కి వెళ్తుందని, టాలీవుడ్ లో ఇది వరకు ఇలాంటివి చాలానే జరిగాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.