Spider Man: స్పైడర్ మ్యాన్​ దెబ్బకు వెబ్​సైట్లు క్రాష్​.. అసలు ఏమైందంటే?

Spider Man: మార్వెల్ కామిక్స్​లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది స్పైడర్​ మ్యాన్​. ఇప్పటికే ఈ కామిక్​ మీద ఎన్నో సిరీస్​లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్పైడర్​ మ్యాన్​కు అభిమానులయ్యారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి స్పైడర్​ మ్యాన్​ను చూసి ఎంజాయ్​ చేశారు. తాజాగా స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్​తో మరోసారి అలంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​. ఈ నెల 16న థియేటర్లలో సందడి చేసేందుకు […]

Written By: Raghava Rao Gara, Updated On : December 10, 2021 6:40 pm
Follow us on

Spider Man: మార్వెల్ కామిక్స్​లో ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది స్పైడర్​ మ్యాన్​. ఇప్పటికే ఈ కామిక్​ మీద ఎన్నో సిరీస్​లు వచ్చాయి. ఈ క్రమంలోనే ఎంతో మంది స్పైడర్​ మ్యాన్​కు అభిమానులయ్యారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరూ థియేటర్లకు వచ్చి స్పైడర్​ మ్యాన్​ను చూసి ఎంజాయ్​ చేశారు. తాజాగా స్పైడర్​ మ్యాన్​ : నో వే హోమ్​తో మరోసారి అలంచేందుకు సిద్ధమయ్యారు మేకర్స్​.

Spider Man

ఈ నెల 16న థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్​ మొదలైపోయింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇండియాలో ఈ సినిమా 16 విడుదల కానుండగా.. ప్రపంచవ్యాప్తంగా తర్వాత రోజు డిసెంబరు 17న రానుంది. ఈ సినిమాను సోనీ పిక్చర్స్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ఇంగ్లీష్, హిందీ, తమిళ, తెలుగు భాషల్లో విడుదల చేయబోతోంది.

Also Read: నేచురల్ స్టార్ నాని “శ్యామ్ సింగరాయ్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి డేట్ ఫిక్స్…

ఈ క్రమంలోనే ప్రపంచవ్యాప్తంగా స్పైడర్ మెన్ : నో వే హోమ్ ఆన్ లైన్ బుకింగ్స్ మొదలయ్యాయి. ఇలా బుకింగ్​ ఓపెన్ అయిన కొన్న గంటల్లో ఒక్క ప్రసాద్స్​ మల్టీప్లెక్స్ థియేటర్​లోనే 5 వేలకుపైగా టికెట్లు అమ్ముడైపోయాయి. దీంతో  ఈ సినిమాకు ఉన్న  డిమాండ్ నేపథ్యంలో వెబ్ సైట్స్ అన్నీ కూడా క్రాష్ అయ్యాయి. దీంతో స్పైడర్ మ్యాన్ అభిమానులు సోషల్​ మీడియాలో తమ ఆగ్రహాన్న వ్యక్తం చేస్తున్నారు.

Also Read: గూడుపుఠాణితో థియేటర్లలో సందడి చేయనున్న సప్తగిరి